ఆగస్టు 28 సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద నాణెం విడుదల కార్యక్రమం జరగనుంది.ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణెన్ని విడుదల చేయనుంది.
ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులకు కేంద్రం ఆహ్వానం పంపగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, సుహాసినితో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్ళనున్నారు.ఎన్టీఆర్ సన్నిహితులకు కూడా కేంద్రం ఆహ్వానం పంపినట్లు సమాచారం.ఎన్టీఆర్ ముద్ర కలిగిన 100 రూపాయల నాణెం.44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో…50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ తో తయారు చేయడం జరిగింది.
అలాగే ఈ నాణానికి ఓవైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం తనకింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు.ఎన్టీఆర్ చేత జయంతి వేడుకలు ఈ ఏడాదితో ముగియనున్న క్రమంలో ఈ నాణాన్ని ముద్రించడం జరిగింది.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి తనకు ఆహ్వానం పంపలేదని ఏపీ తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి రాష్ట్రపతి ద్రౌపతి వర్మకు ఇంకా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.ఎన్టీఆర్ భార్యగా నాణేల విడుదల కార్యక్రమానికి హాజరైన హక్కు తనకు ఉందని తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.
అయినా గాని లక్ష్మీపార్వతికి ఆహ్వానం అందకపోవటంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.