పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేసిన జేడీయూ రాజ్యసభ సభ్యుడు  

Ntish Kumar Lashes Out At Pawan Varma-caa And Npr,delhi Assembly Elections,jdu Chief Nitish Kumar,pavan Varma,pawan Varma

ఢిల్లీ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తో జేడీయూ చేతులు కలపడం పై జేడీయూ రాజ్యసభ సభ్యుడు అసహనం వ్యక్తం చేశారు.ఢిల్లీ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బీజేపీ తో చేతులు కలపడం పై జేడీయూ నేత,సీఎం నితీశ్ కుమార్ అత్యంత సన్నిహితుడైన పవన్ వర్మ అసహనం వ్యక్తం చేశారు.

Ntish Kumar Lashes Out At Pawan Varma-Caa And Npr Delhi Assembly Elections Jdu Chief Nitish Pavan Varma

బీహార్ కు వెలుపల కూడా బీజేపీతో జేడీయూ ఎలా చేయి కలుపుతుందని ఆయన ప్రశ్నించారు.సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల పేరుతో దేశ వ్యాప్తంగా అశాంతిని బీజేపీ ప్రేరేపిస్తోందని, ఇలాంటి సమయంలో ఢిల్లీలో బీజేపీతో చేయి కలపడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో పవన్ వర్మపై నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ స్టాండ్ చాలా క్లియర్ గా ఉందని ఇందులో ఎలాంటి గందరగోళం లేదని నితీశ్ కుమార్ చెప్పారు.

ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు ఉంటే పార్టీలో చర్చించాలని, అంతేకాని బహిరంగంగా స్టేట్ మెంట్లు ఇవ్వడం సరికాదంటూ నితీష్ అసహనం వ్యక్తం చేసారు.పార్టీని వదిలి వెళ్లే అవకాశం ఎవరికైనా ఉంటుందని, కావాలనుకుంటే పార్టీ వదిలి వెళ్లిపోవచ్చని నితీష్ వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు