పెట్టుబడులకు వేదిక, లైవ్ స్ట్రీమింగ్‌లో పండుగలు: ఎన్ఆర్ఐల కోసం వెబ్‌సైట్ రెడీ చేసిన యూపీ సర్కార్

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన ప్రవాస భారతీయులు.దేశాభివృద్ధిలోనూ పాలుపంచుకుంటున్న సంగతి తెలిసిందే.

 Yogi Adityanath Govt Readies Website For Nri Investment, Live-stream Of Festival-TeluguStop.com

వారు ప్రతి ఏటా పంపించే డబ్బు ద్వారా కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో విదేశీ మారక నిల్వలు కలిగి ఉండేందుకు సాయం చేస్తున్నారు.దీనితో పాటు జన్మభూమిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సాయం చేయడంతో పాటు గ్రామాలను దత్తత తీసుకుని పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐలతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెబ్‌సైట్‌ను రూపొందించింది.కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్ఆర్ఐలతో చర్చలు సాగించడానికి ఈ వెబ్‌సైట్ ఉపయోగపడుతుందని యోగి సర్కార్ భావిస్తోంది.

ఎన్ఆర్ఐల పెట్టుబడులను సులభతరం చేయడంతో పాటు అయోధ్యలోని దీపోత్సవ్, బర్సానా హోలీ వంటి ముఖ్యమైన సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలను ఈ వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నారు.దీనిని సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చే వారం ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Telugu Coronavirus, Livestream, Nri, Pravasiratna, Uttar Pradesh, Yogi Adityanat

వెబ్‌సైట్‌ ద్వారా నిర్వహించే కార్యక్రమాలు, ప్రభుత్వ ధ్యేయాలు మొదలైన వాటికి సంబంధించి బుధవారం యూపీ ఎన్ఆర్ఐ వ్యవహరాల శాఖ మంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ ఒక ప్రెజేంటేషన్ ఇచ్చారు.సదరు వెబ్‌సైట్‌లో పర్యాటకం, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖలకు సంబంధించిన లింకుల ద్వారా ఆయా శాఖలతో ప్రవాసులు నేరుగా కనెక్ట్ కావొచ్చని సిద్ధార్థ్ తెలిపారు.అలాగే వివిధ దేశాల్లో స్ధిరపడిన ఎన్ఆర్ఐలకు సంబంధించిన మొత్తం సమాచారం కూడా తెలియజేయబడుతుందని ఆయన చెప్పారు.ఈ వెబ్ సైట్ ద్వారా ప్రవాసీ భారతీయ దివాస్, ప్రవాసీ రత్న అవార్డ్ కోసం ఎన్ఆర్ఐలు దరఖాస్తు చేసుకోవచ్చునని సిద్ధార్థ్ స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube