తమిళనాడు ఇన్వెస్ట్‌మెంట్ అంబాసిడర్‌గా ఎంఆర్ రంగస్వామి.. స్టాలిన్‌పై ఎన్ఆర్ఐల ప్రశంసలు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం దేశం కానీ దేశంలో స్థిరపడినా మాతృభూమిపై మమకారాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు ప్రవాస భారతీయులు.అక్కడ తాము సంపాదించే ప్రతి రూపాయిలో కొంత భాగాన్ని జన్మభూమి కోసం ఖర్చుపెట్టేవారు ఎంతో మంది వున్నారు.

 Nris From Tamil Nadu Welcome Appointment Of Investment Ambassador For State,nri,-TeluguStop.com

అంతేకాకుండా గ్రామాలను దత్తత తీసుకోవడం, ఉచిత విద్య, వైద్య సదుపాయాలు, రోడ్లు, మంచినీటి వసతి కల్పించడం వంటి పనులను ఎన్ఆర్ఐలు నిర్వర్తిస్తున్నారు.అలాగే మనదేశంలో పారిశ్రామిక ప్రగతికి కూడా ప్రవాస భారతీయులు తమ వంతు సాయం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త ఎంఆర్ రంగస్వామిని తమిళనాడు రాష్ట్రానికి గాను ఇన్వెస్ట్‌మెంట్ అంబాసిడర్‌గా నియమించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.ఈ క్రమంలో స్టాలిన్‌పై అమెరికాలోని భారతీయ కమ్యూనిటీ ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

ఈ మేరకు గ్లోబల్ ఐ డిజిటల్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎంఆర్ రంగస్వామి పెట్టబడిదారుడిగా, కార్పోరేట్ ఎకో స్ట్రాటజీ నిపుణుడిగా, కమ్యూనిటీ బిల్డర్‌గా, మానవతావాదిగా అమెరికాలోని భారత సంతతి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.2012లో ఆయన ప్రవాస భారతీయులను ఏకం చేయడానికి.వారి విజయాలను భారత్‌తో పాటు ప్రపంచ వేదికలపై తెలియజేయడానికి ఎన్‌జీవో సంస్థ ఇండియాస్పోరాను స్థాపించారు.

ఆలోచనలను పంచుకోవడం, భారీ ఈవెంట్‌లను హోస్ట్ చేయడం, వ్యక్తులను కలపడం వంటి పనులను ఈ సంస్థ నిర్వహిస్తోంది.డాన్ బాస్కో మెట్రిక్యులేషన్ స్కూల్ ఎగ్మోర్, చెన్నై లయోలా కాలేజీ పూర్వ విద్యార్ధి అయిన రంగస్వామి … కోవిడ్ నేపథ్యంలో తమిళనాడుకు 2 మిలియన్ డాలర్ల విరాళాలను అందజేశారు.

Telugu Rangaswami, Nristamil, Sanfrancisco, Tamilnaducm-Telugu NRI

ఈ సందర్భంగా అమెరికన్ మల్టీ ఎత్నిక్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ కిషోర్ మెహతా మాట్లాడుతూ… ప్రపంచస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడంలో తమిళనాడు అద్భుత ప్రగతి సాధించిందని ప్రశంసించారు.అలాగే డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ టీ.మురుగానందం ఇటీవల తమిళనాడు రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శిగా పదోన్నతి పొందడంపై కిశోర్ అభినందనలు తెలియజేశారు.మురుగానందం సామర్ధ్యాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ గుర్తించారని ఆయన వ్యాఖ్యానించారు.

Telugu Rangaswami, Nristamil, Sanfrancisco, Tamilnaducm-Telugu NRI

అలాగే చికాగోలో స్థిరపడిన ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ తమిళ్ యూత్ యూఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ వీజీ ప్రభాకర్ .రంగస్వామిని ఇన్వెస్ట్‌మెంట్ అంబాసిడర్‌గా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాలిన్‌ను అభినందించారు.రంగస్వామి మద్ధతుతో తమిళనాడు త్వరలోనే భారత్‌లో తొలి పారిశ్రామిక రాష్ట్రంగా అవతరించనుందని ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.వీరితో పాటు ఇండియన్ అమెరికన్ బిజినెస్ కోయలిషన్, వాషింగ్టన్ డీసీ ఛైర్మన్ నీల్ ఖోట్ మాట్లాడుతూ.

ఇన్వెస్ట్‌మెంట్ అంబాసిడర్‌గా రంగస్వామి ఎంపిక సరైన నిర్ణయమన్నారు.ఆయన ఎలాంటి పనినైనా చేయగలరని నీల్ కొనియాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube