ఎన్ఆర్ఐల ఆస్తులే టార్గెట్: అద్దె పేరుతో దిగి… మాదేనంటారు  

Nris City House Chandigarh Illegal Possession - Telugu Chandigarh, Five Arrested For Trespass, Illegal Possession, Nri’s City House, Taking Illegal Possession Of Nri’s City House In Chandigarh, Theft

విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయిన ప్రవాస భారతీయులు.సొంతూరిలో ఉన్న ఆస్తుల నిర్వహణను బంధువులకో, తెలిసిన వారికో అప్పగిస్తుంటారు.

 Nris City House Chandigarh Illegal Possession

ఇలాంటి వాటినే టార్గెట్ చేసి ఎన్ఆర్ఐల ఆస్తులను కబ్జా చేస్తున్న ముఠా గుట్టును చండీగఢ్‌ పోలీసులు రట్టు చేశారు.ఐదుగురు సభ్యుల ఈ ముఠాలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

వీరిని నీరజ్ మల్హోత్రా (45), దిల్‌ప్రీత్ గ్రెవాల్ (33), కుంతి (34), అమర్‌దీప్ సింగ్ (27), వికాస్ జోషి (29)లుగా పోలీసులు గుర్తించారు.

ఎన్ఆర్ఐల ఆస్తులే టార్గెట్: అద్దె పేరుతో దిగి… మాదేనంటారు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ముగ్గురు మహిళల్లో నీరజ్‌కు వివాహం జరగ్గా, మిగిలిన ఇద్దరు వితంతువులు.

వీరంతా ఒక ముఠా ఏర్పడి విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐల ఆస్తులను అక్రమంగా లాక్కుంటారు.ముందుగా ప్రవాస భారతీయుల ఆస్తులను గుర్తించి, అద్దెకు తీసుకుంటారు.

ఒక నిర్థిష్ట కాలపరిమితి తర్వాత అద్దె చెల్లించడం మానేసి, ఆస్తులను ఆక్రమించుకోవడమో లేదంటే మావేనని చెప్పడమో చేస్తారని పోలీసులు తెలిపారు.నిందితుల్లో ఒకరైన నీరజ్ మల్హోత్రాపై ఇప్పటికే పలు చెక్ బౌన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

ఈ మహిళ పేరుతో పంజాబ్‌లోని ట్రిసిటీ, ఇతర జిల్లాల్లో అర డజనుకు పైగా ఇంటి అడ్రస్‌లు ఉన్నట్లుగా తేల్చారు.ఈ నేపథ్యంలో సెక్టార్ 40 ఏలో ఉన్న ఎన్ఆర్ఐ హర్భజన్ సింగ్ ఇంటిని వీరు బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

కేసు వివరాల్లోకి వెళితే.నగరానికి చెందిన హర్భజన్ సింగ్ 2019లో జయేశ్ పంచల్ అనే వ్యక్తికి తన ఇంటిని 11 నెలల పాటు అద్దెకు ఇచ్చారు.కొన్ని నెలల పాటు అద్దె బాగానే చెల్లించిన పంచల్.ఆ తర్వాతి నుంచి అద్దె ఇవ్వడం మానేసి, ఇంటిని ఖాళీ చేస్తానని హర్భజన్‌కు తెలియజేశాడు.

ఈ నేపథ్యంలో జూన్ 19న హర్భజన్ సింగ్ తన మేనల్లుడు అమన్‌జ్యోత్‌ సింగ్‌ని తన ఇంటిని ఒకసారి తనిఖీ చేయమని చెప్పాడు.దీంతో అమన్‌‌జోత్ తన భార్యతో కలిసి అక్కడికి వెళ్లాడు.

అయితే అక్కడ నీరజ్ మల్హోత్రా కనిపించడంతో వారు అవాక్కయ్యారు.వెంటనే తొలుత ఇంటిని అద్దెకు తీసుకున్న జయేశ్ పంచల్ గురించి అడగటంతో వాగ్వాదం రేగింది.

ఈ సమయంలో నీరజ్.మరో ఇద్దరు మహిళలను, ఇద్దరు వ్యక్తులను పిలిచి 112కు ఫోన్ చేసింది.

అమన్‌జోత్ తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసింది.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.

దీంతో అమన్ జోత్ విషయం చెప్పి… ఇంటికి సంబంధించిన పత్రాలను చూపించారు.పరిస్థితి అర్థం చేసుకున్న పోలీసులు ముందుగా అమన్‌జోత్‌ను అదుపులోకి తీసుకుని.

అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.అనంతరం అమన్.

పీఎస్ 39 వద్ద వీరిపై ఫిర్యాదు చేశారు.నీరజ్ మల్హోత్రా అక్రమంగా తన ఇంట్లో ఉండటమే కాకుండా.

విలువైన వస్తువులను దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు.

నీరజ్ మల్హోత్రాను పంచకుల పోలీసులు కస్టడీకి అప్పగించారు.మిగిలిన నలుగురిని జ్యూడీషియల్ కస్టడీకి పంపారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nris City House Chandigarh Illegal Possession Related Telugu News,Photos/Pics,Images..

footer-test