ఎన్నారైలు ఎన్నికల్లో పోటీ చేయచ్చు..కానీ     2018-09-21   15:12:02  IST  Bhanu C

దేశ విదేశాలలో ఉంటున్న ఎన్నారైలు ఎవరైనా సరేస్వదేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారా అయితే ఎన్నికల్లో మీరు కూడా పోటీ చేయవచ్చు అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి అంటోంది భారత ఎన్నికల కమిషన్..అయితే ఎన్నికల కమిషన్ ఎన్‌ఆర్‌ఐలు ఎన్నికల్లో పోటీ చేయడంపై అనుమానాలకు ఎన్నికల కమిషన్‌ 8ఏళ్ల క్రితమే తెరదించింది…అయితే చాలా మంది ఎన్నారైలకి ఈ విషయాలు తెలియకపోవడంతో పోటీ చేయలేమేమో అన్తుకున్తున్నారు అయితే వివరాలలోకి వెళ్తే..

విదేశాల్లో ఉన్నవాళ్లూ ‘ఆన్‌లైన్‌’ ద్వారా ఓటు వేసేందుకు ఈసీ అనుమతిని ఇచ్చింది. చట్ట సభలకూ పోటీ చేయవచ్చని పేర్కొన్నది. ఓటు వేసేందుకు భారతీయ పౌరసత్వం కలిగి ఉండి ఓటరు జాబితాలో పేరుండాలని పేర్కొన్నది. అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో స్థానికుడై ఉండాలని తెలిపింది. విద్య..ఉద్యోగ…ఉపాధి రీత్యా విదేశాల్లో ఉంటున్నట్లు నిరూపించుకోగలగాలని పేర్కొన్నది…అయితే

పార్లమెంట్‌కు పోటీ చేయాలంటే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా స్థానికత ఉండాలి…కానీ వీరికి విదేశీ పౌరసత్వం ఉండరాదు…దీంతో తెలంగాణ ,ఆంధ్రా రాష్ట్రాలలో అసెంబ్లీకి పోటీ చేసేందుకు కొందరు ఎన్‌ఆర్‌ఐలు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది…అయితే పార్టీలు కూడా ఎన్నారైలకి అవకాశాలు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడం గమనార్హం.