ఎయిర్ ఇండియా పై ఎన్నారైల ఆగ్రహం....రీజన్ ఏంటంటే...!!!

అమెరికా నుంచీ భారత్ ప్రయాణించడానికి ఫ్లైట్ ఎక్కడానికి సిద్దమైన ఎన్నారై మహిళకు ఘోర అవమానం జరిగింది.ఈ ఘటనపై ఘాటుగా స్పందించిన ఎన్నారై సంఘాలు ఇదేం దారుణం అంటూ మండిపడటంతో ఈ ఘటన కాస్తా చిలికి చిలికి గాలి వానగా మారి చివరికి ఎయిర్ ఇండియా ప్రతినిధి కల్పించుకుని ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ, అపరాధ రుసుము చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 Nris Angry Over Air India Reason Is , Nri, Air India, San Francisco, Rajasthan,-TeluguStop.com

ఇంతకీ ఏం జరిగింది…భారతీయ మహిళ పట్ల ఎయిర్ ఇండియా ఎలా స్పందించింది అనే వివరాలలోకి వెళ్తే.

రాజస్థాన్ కు చెందిన 85 ఏళ్ళ భారతీయ మహిళ అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో లో ఉంటున్న తన కుమారుడు వద్దకు వెళ్ళారు.

కొన్ని రోజులు అక్కడ ఉన్న తరువాత స్వదేశానికి వెళ్లేందుకు సిద్దమయిన నేపధ్యంలో తన కుమారుడు ఆమెకు ఆన్లైన్ లో కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా టిక్కెట్టు బుక్ చేశారు.దాంతో ఆమె విమానాశ్రయానికి చేరుకొని ఫ్లైట్ ఎక్కుతున్న సమయంలో సిబ్బంది మీకు ఎంట్రీ లేదంటూ ఆమెను నిలువరించారు.

సీట్లు అన్నీ ఫుల్ అయ్యాయని మీకు సీటు లేదని చెప్పారు.ఈ ఘటనతో ఒక్క సారిగా షాక్ తిన్న ఆమె ఈ విషయాన్ని కుమారుడికి చెప్పడంతో.

ఎయిర్ ఇండియా పై ఆమె కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.తాను కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా టిక్కెట్టు బుక్ చేసుకుంటే సీట్లు లేవని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాంతో మరో విమానంలో అవకాశం ఇస్తామని చెప్పినా అతడు ఒప్పుకోలేదు కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేస్తే వేరే విమానంలో ఎలా వెళ్తాం అంటూ ఈ విషయాన్ని భారత ప్రధానికి, పీఏంవో ఆఫీస్ కు ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.ఈ క్రమంలోనే ఎన్నారైలు అందరూ ఎయిర్ ఇండియా పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరికి ఎట్టకేలకు ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పందించారు.

ఆమె ఇష్టం మేరకు వెళ్లేందుకు అన్ని అవకాశాలు కల్పిస్తామని వారికి నష్టపరిహారంగా 1550 డాలర్లు చెల్లిస్తామని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube