భారత్‌లో కరోనా కల్లోలం: ఆత్మీయుల క్షేమ సమాచారంపై ఎన్ఆర్ఐల ఆందోళన

భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది.ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా ఇక్కడ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

 Indian Expats Worried Over Their Aged Parents As Virus Wreaks Havoc Back Home, C-TeluguStop.com

కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ప్రస్తుతం దేశంలోని పరిస్ధితిని తెలియజేస్తున్నాయి.గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,46,786 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 1,66,10,481కి చేరుకుంది.వైరస్ బారినపడిన వారిని రక్షించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కొరత దేశాన్ని వేధిస్తోంది.

ఆసుపత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ నిండుకున్నాయి.దీంతో ఏం చేయాలో పాలుపోక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.

క్లిష్ట పరిస్ధితుల్లో ప్రపంచానికి అండగా నిలిచిన భారతదేశం ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తోంది.ఇప్పటికే భారత్‌ను ఆదుకునేందుకు అమెరికా, ఫ్రాన్స్, యూకే, రష్యా తదితర దేశాలు ముందుకొస్తున్నాయి.

ఈ సంగతి పక్కనబెడితే.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులను.ప్రస్తుతం భారత్‌లో పరిస్ధితులు భయపెడుతున్నాయి.తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఆత్మీయుల క్షేమ సమాచారంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే గతేడాది ఈ మహమ్మారి ఎందరో సన్నిహితులను పక్కనబెట్టుకుంది.లాక్‌డౌన్, ప్రయాణ ఆంక్షల కారణంగా సంవత్సర కాలంగా పలువురు ఎన్ఆర్ఐలు భారత్‌లోని తమ స్వస్థలాలకు రాలేకపోయారు.

కేసుల సంఖ్య తగ్గి.పరిస్ధితి కుదుటపడుతుండటంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

కానీ రోజులు తిరగకుండానే మహమ్మారి మళ్లీ పంజా విసరడంతో ప్రవాసులు ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు.

Telugu Corona, Covid India, Indiacovid, Indianexpats-Telugu NRI

పోనీ ఒకసారి భారత్‌కు వెళ్లి వద్దామా అంటే భారత్‌ విమానాలను నిషేధించాయి ఆయా దేశాలు.ఎమర్జెన్సీ కోటాలో ప్రయాణం పెట్టుకుందామా అంటే దానికి సవాలక్ష అనుమతులు, లాంఛనాలు.దీంతో ఇండియాలోని తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటూనే.

తెలిసిన వారిని ఓ కంట కనిపెట్టమని చెబుతున్నారు.ఉదాహరణకు హర్యానాకు చెందిన రవి భరద్వాజ్, ఆర్తి దంపతులు 2019 డిసెంబర్ నుంచి భారత్‌లోని వారి తల్లిదండ్రులను కలిసింది లేదు.

స్నేహితుడి ఇంట్లో వివాహ వేడుకల సందర్భంగా ఇండియా వెళ్లినప్పుడు చివరిసారిగా పేరెంట్స్ దగ్గర గడిపామని రవి భరద్వాజ్ చెబుతున్నారు.అయితే పరిస్ధితులు కుదట పడ్డాక ఈ ఏడాది మేలో భారత్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని.

కానీ ప్రస్తుతం అక్కడ పరిస్ధితులు భయానకంగా వుండటంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిపారు.గల్ఫ్ , యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా ఇలా ఏ దేశానికి వెళ్లినా రవి లాంటి ఎన్ఆర్ఐలు తారసపడుతూ తమ ఆవేదనను చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube