కరోనాతో చితికిపోతే.. అద్దెపేరిట అధికారుల దౌర్జన్యం, ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తను కదిలించిన కేరళ మహిళ పోరాటం

కేరళకు చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ, లులూ గ్రూప్ అధినేత యూసఫ్ అలీ తన పెద్ద మనసు చాటుకున్నారు.ఆర్ధిక కష్టాల్లో వున్న ఓ కేరళ మహిళకు సాయం చేసి ఆమెను ఆదుకున్నారు.

 Nri Yusuf Ali Pays Rs 9 Lakh In Rent For Kochi Woman Evicted From Shop-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.ప్రసన్న (54) అనే మహిళ కొచ్చిన్ కార్పోరేషన్ స్థలంలో చిన్న దుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది.

అయితే కోవిడ్, లాక్‌డౌన్ తదితర కారణాల వల్ల ఆమె వ్యాపారం సాగడం లేదు.దీంతో కార్పోరేషన్‌కు చెల్లించాల్సిన అద్దె బకాయి పెరిగిపోయింది.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు ఆమెకు రూ.9 లక్షలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు.అంతేకాకుండా ఈ నెల 14న ప్రసన్న దుకాణానికి సీల్ వేసి ఆమెను గెంటేశారు.

 Nri Yusuf Ali Pays Rs 9 Lakh In Rent For Kochi Woman Evicted From Shop-కరోనాతో చితికిపోతే.. అద్దెపేరిట అధికారుల దౌర్జన్యం, ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తను కదిలించిన కేరళ మహిళ పోరాటం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె నిరసనకు దిగింది.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అలా విషయం లులూ గ్రూప్ అధినేత యూసఫ్ అలీ దృష్టికి చేరింది.

దీనిపై స్పందించిన ఆయన వెంటనే ప్రసన్నకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు.దీనిలో భాగంగా బాధితురాలు కొచ్చిన్ కార్పోరేషన్‌కు కట్టాల్సిన రూ.9 లక్షలతో పాటు వ్యాపార ఖర్చులకు మరో రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.11 లక్షలను సోమవారం ఆమెకు అందజేశారు.ఈ సాయంపై ప్రసన్న హర్షం వ్యక్తం చేశారు.

కష్టకాలంలో తమను ఆదుకున్న యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

కేరళలో జన్మించిన అలీ.అబుదాబీ కేంద్రంగా పనిచేస్తున్న లులూ గ్రూప్‌కు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.ఈ గ్రూప్ వివిధ దేశాల్లో హైపర్‌మార్కెట్లు నిర్వహిస్తోంది.

మధ్యప్రాచ్యంలో అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా 2021లో యూసుఫ్‌అలీ స్థానం సంపాదించారు.ఇదే సమయంలో గల్ఫ్‌లోని అన్ని దేశాల అధినేతలతో సన్నిహిత సంబంధం వుండటంతో మధ్యప్రాచ్యంలో అత్యంత ప్రభావవంతమైన భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు.

వ్యాపారంలో రాణిస్తూనే.సమాజానికి ఎంతో కొంత సాయం చేస్తున్నారు.దీనిలో భాగంగాగానే కోవిడ్ 19 విపత్కర కాలంలో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.25 కోట్లు, కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 కోట్లు, యూపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు, హర్యానా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం అందించారు.అలాగే మధ్యప్రాచ్యంలో భారతీయుల తరపున పనిచేస్తున్న సామాజిక, సాంస్కృతిక సంస్థలకు కోటి రూపాయలు అందజేశారు.

Telugu Chairman And Managing Director Of Lulu Group, Forbes Billionaire List, Head Of Nri, Lulu Group, Nri Yusuf Ali Pays Rs 9 Lakh In Rent For Kochi Woman Evicted From Shop, Small Shop At Cochin Corporation Premises, Yusuf Ali-Telugu NRI

యూసఫ్ అలీ ఏప్రిల్‌లో కేరళలో విమాన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.కొచ్చిలో ఏప్రిల్ 11న ఆసుపత్రిలో చేరిన బంధువును చూడటానికి యూసుఫ్ అలీ, ఆయన భార్య హెలికాప్టర్‌లో బయల్దేరారు.షెడ్యూల్ ప్రకారం పనంగడ్లోని ఫిషరీస్ కాలేజీ మైదానంలో హెలికాప్టర్ దిగవలసి ఉంది.కానీ అక్కడికి 200 మీటర్ల దూరంలో ఉన్న చిత్తడి నేల మీద హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది.

అయితే.పక్కనే జాతీయ రహదారి, హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉన్నాయి.

చిత్తడి నేలలోనే హెలికాప్టర్ దిగడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

#SmallShop #Yusuf Ali #Chairman Lulu #NriYusuf #Lulu

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు