ఇండియాకు వస్తూ దోహాలో ఎన్నారై మహిళ మృతి: మరణంపై మిస్టరీ

కర్ణాటకకు చెందిన ఎన్నారై మహిళ దోహలో అనుమానాస్పద స్థితిలో మరణించారు.67 ఏళ్ల రీతా గోపాల్ అమెరికా విస్కాన్సిన్‌లోని బ్రూక్ ఫీల్డ్‌లో నివసిస్తున్నారు.ఈ క్రమంలో ఓ కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను రీతా ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో బెంగళూరుకు బయల్దేరారు.అయితే దోహలో రీతా మరణించినట్లుగా ఆమె కుమారుడు విక్రమ్‌కు సమాచారం అందడంతో అతనికి ఏమి అర్ధం కాలేదు.

 Nri Woman Died In Doha While En Route To Bengaluru From The Us-TeluguStop.com

అప్పటికప్పుడు దొరికిన విమానంలో ఆయన ఫిబ్రవరి 24న దోహా బయల్దేరి వెళ్లారు.

దీనిపై విక్రమ్ మాట్లాడుతూ.

అమ్మ ఫిబ్రవరి 21న చికాగోలో బయల్దేరి ఆ తర్వాతి రోజు ఖతార్‌లోని దోహాకు చేరుకున్నారు.అమ్మ రావడం ఆలస్యం కావడంతో తమకు ఏమి అర్థం కాలేదని, కొన్ని గంటల తర్వాత ఆమె చనిపోయినట్లుగా సమాచారం అందిందన్నారు.

విక్రమ్ అతని సోదరి పల్లవి న్యూయార్క్‌లో స్థిరపడ్డారు.అమ్మ భౌతికకాయాన్ని విడిపించడానికి తాను గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చిందని విక్రమ్ కన్నీటి పర్యంతమయ్యారు.

తాను దోహాలో దిగిన వెంటనే ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన కొంతమంది తమను మెడికల్ సిబ్బందిగా పరిచయం చేసుకుని డాక్యుమెంటేషన్ పని పేరిట అనేక ప్రదేశాలకు తీసుకెళ్లారని చెప్పారు.ఇంత జరుగుతున్నా.

అమ్మ మరణానికి కారణం ఏంటనే దానిపై ఎవ్వరూ సమాధానం చెప్పలేదన్నారు.చివరికి ఫిబ్రవరి 25న రాత్రి 7.30 గంటలకు అమ్మ మృతదేహాన్ని తమకు అప్పగించారని విక్రమ్ తెలిపారు.దోహాలోని వేర్వేరు వ్యక్తులు ఆమె మరణానికి సంబంధించి రకరకాల కారణాలు చెప్పడంతో తాము ఆందోళనకు గురయ్యామన్నారు.

అమ్మ ఛాతీలో నొప్పిగా ఉందని ఫిర్యాదు చేశారని అప్పుడు ఎయిర్‌లైన్స్ సిబ్బంది దోహాలోని మెడికల్ సెంటర్‌కు తరలించారని, మరొకరు ఆమె విమానంలోనే కుప్పకూలిపోయారని చెప్పడంతో.తమకు ఏమి అర్ధం కాలేదన్నారు.

ఎంతో శ్రమించిన తర్వాత ఎట్టకేలకు రీతా గోపాల్ భౌతికకాయాన్ని భారతదేశానికి తరలించిన కుటుంబసభ్యులు చివరి కర్మలు పూర్తి చేసి, శ్రీరంగపట్నంలో ఆమె అస్తికలు నిమజ్జనం చేశారు.

అంతకుముందు రీతాకు ఎలాంటి అనారోగ్యం లేకపోవడంతో, ఆమె ఎలా చనిపోయారనే విషయం అంతుచిక్కక కుటుంబ సభ్యులు మల్లగుల్లాలు పడుతున్నారు.

రీతా భర్త కందవర్ దోహా విమానాశ్రయంలోని ఖతార్ ఎయిర్‌వేస్ మెడికల్ టీంకు ఒక ఈమెయిల్ రాశారు.కానీ ఇప్పటివరకు ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

పద్మశ్రీ అవార్డ్ గ్రహీత కేసీ రెడ్డి సోదరే రీతా.ఆమె భర్త కందవర్ గోపాల్, పిల్లలు విక్రమ్ గోపాల్, పల్లవి గోపాల్ ముగ్గురూ డాక్టర్లే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube