ఛండీగడ్‌: ఎన్ఆర్ఐకి కరోనా లక్షణాలు.. అధికారుల ఉరుకులు, నెగిటివ్ రిజల్ట్  

Nri Tests Negative For Coronavirus - Telugu Chandigarh, China, Corona Virus, Nri, , Telugu Nri News, Travel Ban

ప్రస్తుతం ప్రపంచం కరోనా ధాటికి వణికిపోతున్న సంగతి తెలిసిందే.ఇది తమ దేశాల్లోకి వ్యాప్తి చెందకుండా ఆయా దేశాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్న సంగతి తెలిసిందే.

Nri Tests Negative For Coronavirus - Telugu Chandigarh, China, Corona Virus, Nri, , Telugu Nri News, Travel Ban-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఇతర దేశాల నుంచి తమదేశాల్లోకి వస్తున్న పౌరులను పక్కాగా చెక్ చేసిన తర్వాత గానీ వదలడం లేదు.

తాజాగా ఛండీగడ్‌లో ఓ ఎన్ఆర్ఐకి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించి, రక్తం ఇతర నమూనాలను పరీక్ష కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.ఆదివారం అక్కడి వైద్యులు చేసిన పరీక్షలో అతను నెగిటివ్‌గా తేలాడు.

అనుమానాస్పద ఎన్ఆర్ఐ ఫిబ్రవరి 10న సింగపూర్‌ నుంచి ఛండీగఢ్ నగరంలోని సెక్టార్ 37లో ఉంటున్న తన బంధువుల ఇంటికి వచ్చాడు.అయితే అతనిలో దగ్గు, జలుబు లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

కాగా జనవరి 27న చైనా నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో నావల కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో అధికారులు ఐసోలేషన్ వార్డుకు తరలించారు.అతని నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.పరీక్షల్లో భాగంగా అతను నెగిటివ్‌గా తేలాడు.మరోవైపు కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం నౌకలు, విమానాల్లో భారతదేశానికి వచ్చిన మొత్తం 5776 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ చేశారు.

వీటిలో 1756 శాంపిల్స్‌ను పూణేలోని ఎన్ఐబీలో పరీక్షించగా 3 పాజిటివ్‌గా తేలాయి.ఇప్పటి వరకు కేరళలో 3, కోల్‌కతాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి.

తాజా వార్తలు