'మాత్రు భూమి'కోసం తానా ముందడుగు..     2019-01-10   11:50:42  IST  Surya Krishna

తెలుగు రాష్ట్రాలలో తానా చేపడుతున్న విశేష కార్యక్రమాలు ఎంతో మంది అర్హులకి ఉపయోగపడుతున్నాయి. ఒక్కో కార్యక్రమాన్ని ఒక్కో తానా సభ్యులు కలిసి పలు ప్రాంతాలలో ఏకకాలంలో చేపడుతూ ఎంతో మందిలో స్పూర్తి నింపుతున్నారు. మాత్రు భూమికోసం తానా చేస్తున్న ఈ సేవాకార్యక్రమాలకి విశేష స్పందన కూడా వస్తోంది.

NRI Program TANA Conducts Mathru Bhoomi Program-NRI Telugu News Updates

NRI Program TANA Conducts Mathru Bhoomi Program

పెనగంచి ప్రోలులో తానా చేపట్టిన రైతు రక్షణ పరికరాల అవగాహన సదస్సు , కిట్ల పంపిణీ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. దాదాపు ఇక్కడకి వచ్చిన రైతులకి 350 రక్షణ కిట్లని అందించారు. తానా సభ్యులు.

అలాగే కృష్ణా జిల్లా వీరవల్లిలో సైతం తానా రైతులకి రక్షణ పరికరాలు అందించింది.

అలాగే మహిళలకి కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేసింది. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన మాట్లాడుతూ తానా ఆధ్వర్యంలో ఇప్పటివరకు దాదాపు రూ.1,500 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకూ 30 వేలకి పైగానే రైతులకి రక్షణ కిట్లు పంపిణీ చేసామని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 30 వేలకుపైగా రైతు రక్షణ కిట్లు పంపిణీ చేశామని తెలిపారు.

2 Attachments