అమెరికాలో ఎన్నారైకి 'కోటి'..జరిమానా..!!!

అమెరికన్స్ ని భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలతో గత నవంబర్ లో అరెస్ట్ అయిన భారత సంతతికి చెందినా నిశిత్ కుమార్ పటేల్ అనే వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు.అని విధాలుగా విచారణ చేసిన న్యాయస్థానం అతడికి ఎనిమిదేళ్ళ జైలు, కోటి రూపాయల జరిమానా విధించింది.

 Nri Nishith Kumar Patel Arrested In America For Fake Call Center-TeluguStop.com

ఇంతకీ అతడు చేసిన నేరం ఏమిటంటే.

ఓ కాల్ సెంటర్‌ ద్వారా అమెరికన్లకు ఫోన్లు చేసి తాము పన్ను అధికారులం అంటూ చెప్పి మాకు డబ్బులు చెల్లించాలి లేదంటే అరెస్ట్ చేస్తాము అంటూ బెదిరిస్తూ వచ్చారు.ప్రీపైడ్ కార్డుల ద్వారా పన్ను చెల్లించాలంటూ అనేకమంది అమెరికన్లతో ప్రీపెయిడ్ కార్డ్స్‌ను కొనిపించి, కొత్త బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేయించి తద్వారా సొమ్మును కాజేస్తూ వచ్చాడు.

ఈ మోసాన్ని గమనించిన పోలీసులు చాకచక్యంగా పటేల్‌తో పాటుగా మరో నలుగురిని అరెస్ట్ చేశారు.పటేల్ ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులకి కొంత డబ్బు , ల్యాప్టాప్ ఫోన్లు దొరకడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో మరో ఇద్దరి ఎన్నారైలను, ఇద్దరు అమెరికన్లను అరెస్ట్ చేయగా, వారికి ఇంకా ఎటువంటి శిక్షను ఖరారు చేయలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube