సేవ్ అమరావతి అంటున్న ఎన్నారైలు... దేశం దాటిన ఆందోళన  

Nri Indians Demands Save Amaravati-nri Indians Demands,save Amaravati,tdp,ysrcp

అమరావతి ఆందోళన రాష్ట్రాలు ధాటి ఖండాంతరాలలో కూడా వినిపిస్తుంది.ఏపీలో రాజకీయ రగడ, అమరావతి ఆందోళన ఇతర దేశాలలో ఉన్న ప్రవాస ఆంధ్రులని కదిలిస్తుంది.

Nri Indians Demands Save Amaravati-nri Indians Demands,save Amaravati,tdp,ysrcp తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేషణలు ,రాజకీయ నాయకుల వివరాలు ..కధ-NRI Indians Demands Save Amaravati-Nri Save Amaravati Tdp Ysrcp

ఈ నేపధ్యంలో అమరావతికి మద్దతుగా వారు గొంతు వినిపిస్తున్నారు.అందులో భాగంగా అమరావతి కొనసాగించాలని అమెరికాలో బే ఏరియాలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి ఇది వరకు ఎన్నడూ రానంత మంది వచ్చినట్లు తెలుస్తుంది.ఎపుడూ ఏ సమావేశాల్లోనూ కనిపించని కొత్త మొహాలు ఈ సమావేశంలో కనిపించాయని అక్కడి వారు చెబుతున్నారు.

దీనిని బట్టి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ప్రవాసుల నుంచి ఏ స్థాయిలో మద్దతు ఉందో అర్ధమవుతుందని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

ఇక ఈ సమావేశంలో ప్రముఖ ఎన్నారై మాజీ తానా అధ్యక్షుడు కోమటి జయరాం మాట్లాడుతూ అమరావతి మార్చేస్తే నష్టపోయేది రైతులు మాత్రమే కాదని, భవిష్యత్తు నష్టపోతుందని అన్నారు.

ప్రతి ఒక్క ఆంధ్రుడు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సిందే అని పట్టుబట్టారు.ఈ సమావేశంలో ఎన్నారైలు అమరావతి ఆందోళనలకి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కోమటి జయరాంతో పాటు శ్యామల, విలేఖ్య, చేతన తదితరులు మాట్లాడుతూ ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగాలి అని డిమాండ్ చేశారు.ఇందులో భాగంగా ఎన్నారైలు అందరూ సేవ్ అమరావతి నినాదం చేశారు.

అయితే అమెరికాలో అమరావతి గురించి ఆందోళన చేసినవారు అంతా చంద్రబాబు కమ్యూనిటీకి చెందిన వారు, ఆ పార్టీ మద్దతుదారులే అని అధికార పార్టీ విమర్శలు చేస్తుంది.

.

తాజా వార్తలు