క్వారంటైన్‌లో ఎన్ఆర్ఐ.. ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తానని లక్ష దోచేసిన కేటుగాడు

దేశం కానీ దేశంలో ఎన్నో కష్టాలు పడి స్వదేశానికి వచ్చిన ఎన్ఆర్ఐకి ఓ కేటుగాడు టోకరా వేశాడు.స్వస్థలానికి వెళ్లేందుకు విమాన టికెట్ బుక్ చేస్తానని చెప్పి లక్ష కొట్టేశాడు.

 Nri In Isolation Loses Rs 1 Lakh While Booking Flight Ticket To Bengaluru,bengal-TeluguStop.com

బెంగళూరు నగరంలోని బనశంకరి-IIకు చెందిన అరవింద్ జయరామ్ (30) అనే ఎన్ఆర్ఐ ఒమన్‌లోని ఒక బ్యాంకులో టెక్నాలజీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు.ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కారణంగా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి.

ఆ సమయంలో జయరామ్ శ్రీలంకలో ఉన్నాడు.ఈ క్రమంలో వందే భారత్ మిషన్‌లో భాగంగా మే 29న ప్రత్యేక విమానంలో ముంబై వచ్చాడు.

లాక్‌డౌన్ నిబంధనలను అనుసరించి అధికారులు జయ్‌రామ్‌ను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచారు.

ఈ సమయంలో అతను తన స్వస్థలం బెంగళూరు వెళ్లేందుకు గాను ఫ్లైట్ టికెట్ కోసం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి ఓ స్పైస్ జెట్ లింక్‌ను కనుగొన్నాడు.

వెంటనే అక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేశాడు.అవతలి వైపు వ్యక్తి.తనను తాను టికెట్ బుకింగ్ కార్యాలయంలో స్పైస్ జెట్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు.ఆ వెంటనే తాను మరో ఫోన్ నెంబర్ నుంచి ఓ కోడ్‌ను తీసుకుంటానని చెప్పి.

మరో నెంబర్ నుంచి ఫోన్ చేశాడు.జయరామ్ అతను చెప్పినట్లుగానే చేశాడు.కొద్దిసేపటి తర్వాత జయరామ్ ఖాతా నుంచి రూ.5,000 డెబిట్ అయినట్లు మేసేజ్ వచ్చింది.

దీంతో భయపడిన బాధితుడు వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసినప్పటికీ, కానీ ఎలాంటి స్పందన రాలేదు.చివరికి తన ఖాతాను బ్లాక్ చేయాల్సిందిగా ఈ మెయిల్ చేశాడు.కానీ తర్వాతి కొద్ది గంటల్లోనే అతని అకౌంట్ నుంచి ఐదు విడతలుగా మొత్తం రూ.99,995 డెబిట్ అయినట్లు మేసేజ్ వచ్చింది.దీంతో మరింత గాబరా పడిన అరవింద్ వెంటనే బ్యాంక్ అధికారులకు సమాచారం అందించడంతో పాటు బెంగళూరులో వున్న తన సోదరునితో పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పాడు.

Telugu Aravind Jayram, Bengaluru, Ticket, Nriloses, Quarantine, Spicejet-Telugu

అయితే ఖాతాదారుడు లేకుండా కేసు నమోదు చేసుకోవడం కుదరదని పోలీసులు ఫిర్యాదును తిరస్కరించారు.దీంతో జయరామ్ బెంగళూరు దక్షిణ మండల డీసీపీతో మాట్లాడి విషయం చెప్పాడు.ముంబైలో క్వారంటైన్ ముగించుకున్న జయరామ్ బెంగళూరులో మరో ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నాడు.

బ్యాంక్ అధికారులు సైతం ఖాతాదారుని నిర్లక్ష్యం అని పేర్కొంటూ సాయం చేయడానికి నిరాకరించారని.ఆ తర్వాత తన ఇబ్బందిని అర్ధం చేసుకున్నారని జయరామ్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube