వ్యాపారంలో మనస్పర్థలు.. మాజీ భాగస్వామి హత్యకు కుట్ర, కిరాయి హంతకులకి ఎన్ఆర్ఐ సుపారీ

పంజాబ్‌లోని( Punjab ) జిరాక్‌పూర్‌లో రద్దీగా వుండే లోహ్‌ఘర్ ప్రాంతంలో వున్న మెట్రో ప్లాజా సిటీ మార్కెట్‌లో శుక్రవారం సాయంత్రం ముగ్గురు గుర్తు తెలియని దుండగులు ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరపడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

దీంతో జనం ప్రాణభయంతో పరుగులు తీశారు.

ఈ ఘటనలో గాయపడిన వారిని నవాన్‌షహర్‌కు చెందిన ఇంద్రజిత్ సింగ్,( Indrajit Singh ) లూథియానాకు చెందిన సతీందర్ సింగ్‌గా( Satinder Singh ) గుర్తించారు.ఇంద్రజిత్‌కు ఛాతీలో బుల్లెట్ దూసుకెళ్లడంతో జిరాక్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు.

ప్రస్తుతం ఇతని పరిస్ధితి విషమంగా వుంది.అటు సతీందర్ తొడలో బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయన చండీగఢ్‌లోని సెక్టార్ 32లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరాడు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ దాడి జరిగిందని నిర్థారించి ఆ కోణంలో ఆరా తీశారు.

Advertisement

ఈ క్రమంలో అమెరికాలో వుంటున్న ఎన్ఆర్ఐ జస్వీందర్ సింగ్( NRI Jaswinder Singh ) ఈ ఘటనకు బాధ్యుడిగా గుర్తించారు.వెంటనే అతనిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

ఈ హత్య కోసం జస్వీందర్ కిరాయి హంతకులను నియమించుకుని వారికి భారీ మొత్తం సుపారీగా ఇచ్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు.

ఇంద్రజిత్ తల్లి ఫిర్యాదు మేరకు జస్వీందర్‌పై కేసు నమోదు చేశారు.హిమాచల్ ‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో జస్వీందర్- ఇంద్రజిత్‌లు డి అడిక్షన్ సెంటర్‌ను( De-Addiction Center ) నిర్వహించేవారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఆర్ధిక లావాదేవీల కారణంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో.

ఇంద్రజిత్‌ను జస్వీందర్ చంపేస్తానని బెదిరించాడు.దీంతో భయపడిన ఇంద్రిజిత్ నవాన్‌షహర్‌ను విడిచిపెట్టి జిరాక్‌పూర్‌కు మకాం మార్చాడు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ఈ క్రమంలో శుక్రవారం ఇంద్రజిత్, తన స్నేహితుడు సతీందర్‌తో కలిసి మెట్రో ప్లాజా సిటీ మార్కెట్‌లోని జిమ్ నుంచి బయటకు వస్తుండగా వీరిపై కిరాయి హంతకులు కాల్పులు జరిపారు.హత్యా ప్రయత్నం వెనుక ఇతర కారణాలను పోలీసులు వెల్లడించలేదు.అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

దాడి తర్వాత కారులో పారిపోయిన షూటర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.జిరాక్‌పూర్ పరిసర ప్రాంతాల్లో వున్న టోల్‌ప్లాజాలలోని సీసీటీవీ ఫుటేజ్‌ని తనిఖీ చేస్తున్నారు.

తాజా వార్తలు