నోటి దూలతో జడ్జ్‌ను తిట్టి రూ. 130 కోట్ల నష్టపరిహారం చెల్లించాడు.. అసలు విషయం ఏంటో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు

నోరును అదుపులో పెట్టుకోకుంటే కొన్ని సార్లు దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అవతలి వ్యక్తి పవర్‌ తెలియకుండా మాట్లాడితే ఏం జరుగుతుందో మనం అప్పుడప్పుడు వార్తల్లో విని ఉంటాం, పేపర్లో చదివి ఉంటాం.

 Nri Has To Pay 130 Crores For Insulting Judge-TeluguStop.com

దాంతో అవతలి వ్యక్తి గురించి తెలుసుకుని, అలా మాట్లాడితే ఏం జరుగుతుందనే విషయాన్ని కాస్త ఆలోచించి ఆ తర్వాత జాగ్రత్తగా మాట్లాడటం బెటర్‌.చాలా మంది మాత్రం నోటి దూలతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు.

తాజాగా కొలంబియాకు చెందిన ఒక ఎన్నారై డాక్టర్‌కు జడ్జి 130 కోట్ల జరిమానా వేసింది.అది కేవలం అతడి నోటి దూల వల్లే జరిగింది

పూర్తి వివరాల్లోకి వెళ్తే… భారత్‌కు చెందిన 69 ఏళ్ల గోపీనాథన్‌ ఒక డాక్టర్‌.

ఈయన 1997వ సంవత్సరంలో ఇండోనేషియాలోని ఒక హాస్పిటల్‌లో పని చేసేవాడు.ఆ సమయంలో హాస్పిటల్‌లోని నర్స్‌తో సంబంధం పెట్టుకుని భార్యతో విడాకులు తీసుకున్నాడు.

భార్య విడాకులు తీసుకున్న తర్వాత నర్స్‌ను పెళ్లి చేసుకున్నాడు.నర్స్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు.

ఆ తర్వాత జాబ్‌ కారణంగా కొలంబియాకు వెళ్లి పోయాడు.అయితే భార్య పిల్లలను మాత్రం అక్కడే ఉంచేశాడు.

అతడు ఎన్ని సార్లు అడిగినా తీసుకు వెళ్లక పోవడంతో పాటు, పలు అనుమానాలకు తావు ఇస్తున్న నేపథ్యంలో అతడి నుండి విడాకులు తీసుకోవాలని రెండవ భార్య భావించింది.

నోటి దూలతో జడ్జ్‌ను తిట్టి రూ.

కొలంబియా కోర్టులో విడాకులకు దరకాస్తు చేసుకుంది.విడాకుల కేసు నడుస్తున్న సమయంలో గోపీనాధన్‌ ఆస్తుల అమ్మకం, పంపకం వంటివి చేస్తున్న నేపథ్యంలో కోర్టు జడ్జ్‌ ఆ పక్రియను ఆపివేయడం జరిగింది.దాంతో లేడీ జడ్జ్‌పై గోపీనాథన్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తన భార్య నుండి లంచం తీసుకుని జడ్జ్‌ అలా తీర్పు ఇచ్చిందని ఆగ్రహంతో ఊగిపోతూ నోటి దూలతో అనేశాడు.గోపీనాథన్‌ మాటలను సీరియస్‌గా తీసుకున్న ఆ లేడీ జడ్జ్‌ ఏకంగా 130 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పించడంతో ఆటు, నెలకు 50 లక్షల చొప్పున ఇవ్వాలంటూ తీర్పు ఇవ్వడం జరిగింది.

నోటి దూల లేకుంటే 130 కోట్లు మిగిలేవి.కాని అతడి నోటి దూలతో అంత పని చేసుకన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube