గోల్డ్ స్కీం 18.58 లక్షల మోసం: శిల్పాశెట్టి దంపతులపై కేసు పెట్టిన ఎన్నారై  

NRI Filed Complaint Against Actor Shilpa Shetty Husband Raj Kundra - Telugu Gold Scheme Scam, Gold Trading Company, Marketing Scam, Raj Kundra, Shilpa Shetty Husband, గోల్డ్ స్కీం

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై ఓ ప్రవాస భారతీయుడు చీటింగ్ కేసు పెట్టాడు.వీరి యాజమాన్యంలో ఉన్న ఓ సంస్థ తనను గోల్డ్ స్కీం పేరిట మోసం చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Nri Filed Complaint Against Actor Shilpa Shetty Husband Raj Kundra

సచిన్ జోషి అనే ఎన్నారై శిల్పా శెట్టి దంపతులకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ 2014లో ఓ గోల్డ్ స్కీమ్ ప్రవేశపెట్టిందని.దీనిలో భాగంగా రూ.58 లక్షలతో కిలో బంగారం కొన్నానని సచిన్ జోషి తెలిపారు.ఆ సమయంలో కిలో బంగారం కొంటే ఓ గోల్డ్ కార్డ్ ఇచ్చి ఐదు సంవత్సరాల కాల పరిమితి ముగిసిన తర్వాత దానిని మార్చుకుంటే కొంత బంగారం ఇస్తామని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఐదేళ్ల తర్వాత స్కీం కాలపరిమితి 2019 మార్చి 25తో ముగిసిందని.తాను గోల్డ్ కార్డ్ మార్చుకోవాలని భావించానన్నారు.

గోల్డ్ స్కీం 18.58 లక్షల మోసం: శిల్పాశెట్టి దంపతులపై కేసు పెట్టిన ఎన్నారై-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఇందుకోసం బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న సత్యయుగ్ కంపెనీ కార్యాలయానికి వెళితే.క్లోజ్డ్ బోర్డు కనిపించిందని సచిన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ కంపెనీ గురించి ఆరా తీస్తే.శిల్పా, రాజ్‌లు సత్యయుగ్‌కు డైరెక్టర్లుగా వ్యవహరించారని, అయితే 2016, 2017లలో తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలిసిందని సచిన్ వెల్లడించారు.

తాను మోసపోయానని గ్రహించి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశానని సచిన్ కన్నీటి పర్యంతమయ్యారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు