భారత ఇంజనీర్ కి అరుదైన గౌరవం...!!!  

Nri Engineer Wins Innovation Award-innovation Award,nri

ఎంతో మేధస్సు, ఆలోచనలు, తెలివి తేటలు కలిగిన వారు భారతీయులు అనే విషయం ప్రపంచ దేశాలు గుర్తించాయి కాబట్టే, ఎప్పటికప్పుడు అత్యంత ప్రతిభ కలిగిన భారతీయులని తమ దేశాలవైపు ఆకర్షిస్తూ భారీగా జీతభాత్యాలని ఆఫర్ చేస్తూ తమ దేశాభివృద్ధిలో భాగస్వాములని చేస్తుంటాయి..

భారత ఇంజనీర్ కి అరుదైన గౌరవం...!!!-NRI Engineer Wins Innovation Award

ఈ క్రమంలోనే భారతీయులు, ఆయా దేశాలలో కీలక వ్యక్తులుగా,రాజకీయ రంగంలో సైతం దూసుకువెళ్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎన్నో బహుమతులు, మరెన్నో అవార్డులు సొంత చేసుకున్న భారతీయులు దేశ విదేశాల్లో ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి ఘటనే బ్రిటన్ లో జరిగింది.

తాజాగా బ్రిటన్ లో ఓ భారతీయ ఇంజనీర్ కి అరుదైన గౌరవం లభించింది..

టెక్నాలజీ తో పరుగులు తీస్తున్న నేటి ప్రపంచంలో, ఈరోజుకి కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో ఐసీయూ సౌకర్యం లేక శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందితో ప్రతీ ఏటా లక్షలాది మంది పిల్లలు చనిపోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ మరణాలకి పులిస్టాప్ పెట్టడానికి “కంటిన్యుయస్‌ పాజిటివ్‌ ఎయిర్‌వే ప్రెషర్‌” అనే పరికరాన్ని కనుగొని అత్యంత గొప్ప విజయం సాధించారు.

దాంతో ఇంజనీర్‌ నితేశ్‌కుమార్‌ కు, 2019 ఏడాదికి గాను కామన్వెల్త్‌ “సెక్రటరీ జనరల్ ఇన్నొవేషన్‌ ఫర్‌ సస్టయినబుల్‌ డెవల్‌పమెంట్‌” అవార్డు వరించింది.ఈ అవార్డుని బ్రిటన్ యువరాజు హ్యారీ చేతుల మీదుగా అందుకున్నారు నితెష్ కుమార్ .