బెజవాడ కనకదుర్గమ్మకు కనక పుష్యరాగ హారం: ఎన్ఆర్ఐ భక్తుడి విరాళం

భక్తుల పాలిట కొంగు బంగారమైన బెజవాడ కనక దుర్గమ్మ పట్ల ఓ ప్రవాస భారతీయుడు తన భక్తిభావం చాటుకున్నాడు.విజయవాడకు చెందిన తాతినేని శ్రీనివాస్ అనే ఎన్ఆర్ఐ భక్తుడు రూ.45 లక్షల విలువ చేసే కనక పుష్యరాగ హారాన్ని విరాళంగా అందజేశారు.ఈ హారాన్ని ప్రతీ గురువారం దుర్గమ్మకు అలంకరించనున్నారు.

 Nri Donate Kanaka Pushya Haram For Vijayawada Kanaka Durga Temple Vijayawada, K-TeluguStop.com

ఈ హారంలో పొదిగిన కనక పుష్యరాగాలు అన్ని ఒకే సైజులో ఉండేందుకు గాను సింగపూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు.తాను వృత్తి రీత్యా అట్లాంటాలో ఉంటానని.తమ కుమారుడి మొదటి నెల వేతనంతో ఈ హారం అమ్మవారికి సమర్పించినట్లు ఎన్ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ వెల్లడించారు.అమ్మవారికి హారం చేయించడం తమ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ… గత ఆరు నెలలుగా కనకదుర్గమ్మకు ఏడు వారాల నగలు అలంకరిస్తున్నామని, భక్తులు ఎవరైనా అమ్మవారికి 7 వారాల నగలు సమర్పించాలనుకుంటారో వారు దేవస్థానంలో సంప్రదించాలని కోరారు.

దుర్గమ్మకు అలంకరించే ఏడు వారాల నగలు

► సోమవారం- ముత్యాలు ► మంగళవారం- పగడలు ► బుధవారం- పచ్చల ► గురువారం- కనకపుష్యరాగాలు ► శుక్రవారం-వజ్రం ► శనివారం-నీలం ► ఆదివారం-కెంపులు

కాగా, శనివారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.మొత్తం పది అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది.కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ వినాయక గుడి నుంచి రావాలి.ఆన్‌లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఐడీ కార్డు ఉంటేనే అనుమతిస్తారు.అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు చీరను సమర్పిస్తారు.

దసరా నవరాత్రులలో నాలుగవ రోజైన చవితి నాడు (సోమవారం) అమ్మవారు అన్నపూర్ణా దేవిగా దర్శనమిస్తున్నారు.సృష్టిలోని ప్రతీజీవికి కావలసిన చైతన్యం కలిగించే మహాశక్తి అన్నపూర్ణ.ఒక చేతిలో అక్షయ పాత్రతో, మరియొక చేతిలో గరిటెతో దర్శనమిస్తుంది.సాక్షాత్తూ పరమేశ్వరునికే భిక్షనొసంగిన అన్నపూర్ణ అక్షయ శుభాలను కలిగిస్తుంది.

ఈ రోజు అన్నపూర్ణాష్టక పారాయణ శుభదాయకం.

.

Nri Donate Kanaka Pushya Haram For Vijayawada Kanaka Durga Temple Vijayawada, Kanaka Durga Temple, Kanaka Pushya Haram, Nri, Thathineni Srinivas Rao, Indrakeeladri Sharannavaratrulu, Cm YS Jagan Mohan Reddy, Annapurnastaka Parayanam - Telugu Cmys, Kanakadurga, Kanakapushya, Vijayawada

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube