పెద్ద మనసు: ఢిల్లీలో 100 తెలుగు కుటుంబాలకు నిత్యావసరాలు అందించిన ఎన్ఆర్ఐ

కరోనా కారణంగా దేశంలో అన్ని రకాల పనులు నిలిచిపోయాయి.ముఖ్యంగా పలుగు, పారలు, గొడ్డళ్లు, గంపలు చేతబట్టి పెద్ద సంఖ్యలో పోటెత్తే కూలీలు ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు.

 Nri Divya Ravella, Food Items,telugu Families In Delhi, Corona Effect-TeluguStop.com

రెక్కాడితే కానీ డొక్కాడని వీరి పరిస్ధితి ఇప్పుడు అగమ్యగోచరం.వీరి కుటుంబాలను ఆదుకోవడానికి కొందరు సాయం చేస్తున్నప్పటికీ అవి అందరికీ అందడం లేదు.

లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి లేకపోవడంతో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వున్న వలస కూలీలు పెద్ద సంఖ్యలో తమ సొంత రాష్ట్రాలకు వలస వెళ్లడం పలువురిని కలచివేసింది.ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీలో ఉపాధి కోసం వచ్చిన పలు కుటుంబాలను తెలుగు ఎన్ఆర్ఐ దివ్య రావెళ్ల ఆదుకున్నారు.
ఆదివారం న్యూఢిల్లీ సుల్తాన్‌పూర్‌ ప్రాంతంలో డాక్టర్ ఆనంద్ సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి తన ఎన్‌జీవో సంస్థ బంజారా మహిళ ఎన్‌జీవో ద్వారా పేదలకు ఆహారాన్ని పంపణీ చేశారు.100 పేద తెలుగు కుటుంబాలకు గోధుమలు, నూనె, పప్పు, ఇతర ఆహార పదార్ధాలను దివ్య అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ తన మిత్రురాలు, స్పాన్సర్ దివ్య రావెళ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కోవటానికి ప్రతి ఒక్కరూ సామాజిక దూరం, పరిశుభ్రతను పాటించాలని ఆయన కోరారు.అలాగే ఈ సంక్షోభ సమయంలో పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఆనంద్ అభ్యర్ధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube