ఎన్నారై భారీ స్కెచ్...రూ. 37 కోట్లు కొల్లగొట్టాలని అనుకున్నాడు...కానీ

డబ్బు మీద ఆశ ఉండచ్చు కానీ అత్యాశ ఉండకూడదు.అత్యాశకు పొతే అందుకు తగ్గట్టుగా వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 Nri Death Plan To Cheat Insurance Company For Money, Insurance Company, Nri, Dea-TeluguStop.com

ఇలా అత్యాశకు పోయిన ఓ ఎన్నారై ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తూ చిప్పకూడు తింటున్నాడు, అతడితో పాటు అతడి స్నేహితులు కూడా ఊచలు లెక్క పెడుతున్నారు.తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.

అమెరికాలో ఎన్నారైలు తమ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థానాలలో కొలువుదీరుతూ భారత్ కు పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తుంటే ఓ ఎన్నారై మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించాడు.

మహారాష్ట్రకు చెందిన ప్రభాకర్ అనే ఎన్నారై అమెరికాలో 20 ఏళ్ళ నుంచీ ఉంటున్నాడు.

ఎంతో ఉన్నతంగా ఉంటున్న సదరు ఎన్నారై ఆలోచన దారి తప్పింది.ఫలితంగా తాను ఇన్స్యూరెన్స్ కంపెనీలో గతంలోనే రూ.37 కోట్ల ఇన్స్యూరెన్స్ చేసుకున్నాడు.అయితే చనిపోతే వచ్చే సొమ్ముకంటే కూడా బ్రతికి ఉండగానే డబ్బు కావాలనుకున్నాడు దాంతో తాను చనిపోయినట్టుగా నటించి కంపెనీని నమ్మిస్తే డబ్బులు అవే వస్తాయని భావించాడు.

ఈ క్రమంలోనే ఓ పధకాన్ని రచించాడు.పధకంలో భాగంగా ఈ ఏడాది జనవరి నెలలో తన సొంత ఊరు వెళ్ళాడు.అక్కడి నుంచీ వేరే ఊరుకు అద్దెకు మకాం మార్చి అక్కడే ఉంటున్నాడు.అయితే

అదే ఊరిలో మతిస్థిమితం లేని వ్యక్తిని పాముతో కరిచి చంపించారు.

చనిపోయిన తరువాత ఆ వ్యక్తి ని ఆసుపత్రికి తీసుకువెళ్ళి చనిపోయింది ఎన్నారై ప్రభాకర్ అంటూ నకిలీ పత్రాలు సృష్టించి ప్రభాకర్ స్నేహితులు డెత్ సర్టిఫికెట్ సంపాదించారు.ఈ సర్టిఫికెట్ తీసుకుని అమెరికాలోని ఇన్స్యూరెన్స్ కంపెనీలో క్లెయిమ్ చేసేందుకు ప్రభాకర తన కొడుకుని పంపాడు.ఇక్కడి వరకూ స్కెచ్ బాగానే నడిచింది.అయితే ఇన్స్యూరేస్ కంపెనీ వారికి మాత్రం ఎక్కడో తేడా కొట్టడంతో నలుగురు సభ్యుల బృందాన్ని విచారణకోసం పంపగా ప్రభాకర్ నాటకం ఆడుతున్నాడని గ్రహించారు.

ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎన్నారై ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు.మిగిలిన స్నెహితులు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube