ఎన్నారై అని చెల్లెలిని లైన్లో పెట్టి.... అక్కని దారుణంగా...

Nri Cheated Two Sisters In Bangalore

ప్రస్తుత కాలంలో కొందరు సోషల్ మీడియా మోజులో పడి ముక్కు మొహం తెలియని వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తూ మోసపోతున్నారు.తాజాగా ఓ వ్యక్తి తాను ఎన్నారై అని చెప్పి ఓ మహిళని బురిడీ కొట్టించి ఆమె నుంచి దాదాపుగా 70 లక్షల రూపాయలకు పైగా తీసుకుని ఉడాయించిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ప్రాంతంలో చోటు చేసుకుంది.

 Nri Cheated Two Sisters In Bangalore-TeluguStop.com

వివరాల్లోకి వెళితేస్థానిక రాష్ట్రంలోని బెంగళూరు ప్రాంతంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు నివాసం ఉంటున్నారు.అయితే వీరిలో అక్క చెల్లెలి కోసం విదేశీ పెళ్లి సంబంధాలను చూస్తోంది.ఈ క్రమంలో చెల్లెలికి సోషల్ మీడియా మాద్యమమం అయినటువంటి పేస్ బుక్ లో బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.దీంతో ఆ వ్యక్తితో మహిళ చెల్లెలు ప్రేమలో పడింది.

దీంతో ఈ విషయాన్ని తన అక్కకి చెప్పడంతోఎలాగో తాను కూడా తన చెల్లెలి కోసం విదేశీ సంబంధాలను చూస్తోంది కాబట్టి ఆమె ప్రేమ విషయానికి ఒకే చెప్పింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా న్యూ ఇయర్ కోసం అక్కాచెల్లెళ్లకి కలిపి ఖరీదైన బహుమతులను పంపించానని చెల్లెలితో చెప్పడంతో ఇద్దరు కలిసి ఆనందంతో పొంగిపోయారు.అనంతరం కొందరు వ్యక్తులు తమకు బ్రిటన్ దేశం నుంచి ఖరీదైన బహుమతులు వచ్చాయని కాకపోతే అందుకు సంబంధించినటువంటి రుసుము చెల్లించి తీసుకోవాలని చెప్పడంతో అక్కా చెల్లెళ్ళు ఏమీ ఆలోచించకుండా దాదాపుగా 70 లక్షల రూపాయలకు పైగా వారి ఖాతాల్లో జమ చేశారు.ఖాతాలో డబ్బు జమ చేసిన రోజునుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది.

దీంతో మోసపోయామని గ్రహించినటువంటి అక్కచెల్లెళ్ళు లబోదిబోమంటూ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితురాళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అంతేకాక ఇలా ముక్కు మొహం తెలియని వారి ఖాతాలోకి డబ్బు జమ చేయరాదని  ఇద్దరు అక్కాచెల్లెళ్లు ను హెచ్చరించి పంపారు.

#Bangalore #Bangalore #Bangalore #Bangalore #Nri Sisters

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube