TAX కట్టనంటే ఎట్లా..ఎన్నారై కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..!!!

కరోనా కారణంగా విదేశాలలో ఉంటున్న ఎంతో మంది భారతీయులు వారి వారి స్వంత ప్రాంతాలకు వచ్చేసిన విషయం విధితమే.ఇలా వచ్చిన వారిలో కొందరు ఆయా దేశాలు ఆంక్షలు సడలించిన తరువాత వెళ్ళిపోగా మరికొందరు భారత్ లోనే ఉండిపోయారు.

 Tax కట్టనంటే ఎట్లా..ఎన్నారై కు ష�-TeluguStop.com

ఈ క్రమంలో కొందరు భారత్ లోనే దీర్ఘకాలికంగా ఉన్న కారణంగా ఆదాయపు పన్ను కట్టాల్సి వచ్చింది.అయితే ఓ ఎన్నారై మాత్రం తాను ఆదాయపు పన్ను కట్టేది లేదంటూ కోర్టుకెక్కాడు.

తాను ఇండియాలో ఉండటం లేదని, కరోనా కారణంగా భారత్ కు వచ్చి ఆంక్షల కారణంగా చిక్కుకు పోయానని అలాంటప్పుడు తనను ఆదాయపు పన్ను కట్టమని చెప్పడం సరైనది కాదని వాదించాడు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇచ్చిన నోటీసులను ఛాలెంజ్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

తనను 1961 చట్టం ప్రకారం తనను నాన్ రెసిడెంట్ గా గుర్తిస్తూ నోటీసులు జారీ చేశారని తన పిటిషన్ లో పేర్కొన్నాడు.సదరు ఎన్నారై వేసిన పిటిషన్ ముగ్గురు న్యాయమూర్తులు కలిసిన బెంచ్ పరిశీలించింది.

పూర్వాపరాలు తెలుసుకున్న తరువాత సదరు ఎన్నారై దే తప్పని ప్రకటించింది.ఎందుకంటే జులై నెలలో తనకు ఎయిర్ బబుల్ విధానం అమలులోకి వచ్చిందని అయితే ఎన్నారై అది వినియోగించుకోలేదని చెప్పింది.

మార్చి 6 -2020 న భారత్ లోకి వచ్చిన ఎన్నారై తిరిగి అక్టోబర్ 5 న తిరిగి వెళ్లిపోయాడని, ఈ క్రమంలో 182 రోజులు గడవడంతో ఆయన్ను ఇండియన్ రెసిడెంట్ గా గుర్తించిన కారణంగానే నోటీసులు అందించారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కు తప్పనిసరిగా ఆదాయపు పన్ను చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది.ఇదిలాఉంటే ఎన్నారైలను రెసిడెంట్ గా గుర్తించి ట్యాక్స్ విధించడానికి రెండు అంశాలు పరిగణలోకి తీసుకోబడుతాయి అవేంటంటే స్వదేశానికి వచ్చిన తరువాత 182 రోజులు భారత్ లో ఉండకూడదు , ఇక రెండవది నాలుగేళ్ల కాలంలో 365 రోజుల కంటే ఎక్కువ రోజులు ఇండియాలో ఉండకూడదు ఒక వేళ ఉంటె అతడిని ఇండియాలోనే ఉంటున్న వారిగా పరిగణలోకి తీసుకుని ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకువస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube