పేద కుటుంబం లోన్ క్లియర్.. మాట నిలబెట్టుకున్న ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త యూసుఫ్ అలీ

విదేశాలలో వ్యాపారవేత్తగా స్థిరపడినప్పటికీ తన పుట్టినగడ్డ రుణం తీర్చుకుంటూనే వున్నారు కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు, లులూ గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ.ఓ పేద కుటుంబం లోన్ మొత్తాన్ని చెల్లిస్తానని ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు.

 Nri Businessman Yusuf Ali Keeps Promise, Repays Loan Amount Of Poor Family , Nri-TeluguStop.com

కొచ్చికి చెందిన అమీనా అనే మహిళ తన కుమార్తె పెళ్లి కోసం స్థానిక కీచేరి సర్వీస్ కో ఆపరేటివ్ బ్యాంకులో తన భూమి, ఇల్లు తనఖా పెట్టి రుణం తీసుకుంది.అయితే దీనిని గడువు లోగా చెల్లించడంలో అమీనా విఫలమైంది.

దీంతో ఆమె భూమి, ఇంటిని బ్యాంకు జప్తు చేసింది.దాచుకున్న కాస్త డబ్బును భర్త చికిత్స కోసం ఉపయోగించడంతో అమీనాకు ఏం చేయాలో పాలుపోలేదు.

ఈ ఏడాది ప్రారంభంలో హెలికాఫ్టర్ క్రాష్ ల్యాండ్ అయిన సమయంలో తన కుటుంబాన్ని రక్షించిన రాజేశ్, అతని కుటుంబాన్ని పరామర్శించడానికి యూసుఫ్ అలీ పనంగాడ్‌కు వచ్చారు.ఈ విషయం తెలుసుకున్న అమీనా ఆదివారం అక్కడికి వెళ్లి ఆయనతో తన గోడు వెళ్లబోసుకుంది.

ఇది విన్న అలీ చలించిపోయారు.తక్షణం ఆమె చెల్లించాల్సిన రుణాన్ని బ్యాంక్‌కి చెల్లించి ఇల్లు, భూమిని విడిపించాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించారు.

ఈ సోమవారం అమీనా, ఆమె భర్త వద్దకు కొందరు వ్యక్తులు వచ్చారు.వారు లులూ గ్రూప్ ఉద్యోగులు.మీరు బ్యాంక్‌కి చెల్లించాల్సిన మొత్తం రూ.3,81,160 లక్షలను పే చేసినట్లు వారికి తెలిపారు.ఇందుకు సంబంధించి రశీదుతో పాటు అమీనా భర్త వైద్య ఖర్చుల కోసం మరో రూ.50లను వారికి అందజేశారు.క్లిష్ట పరిస్ధితుల్లో తమకు అండగా నిలిచిన యూసుఫ్ అలీకి అమీనా దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Telugu Abu Dhabi, Amina, Grounds, Lulu Employees, Nri Businessman, Nribusinessma

కేరళలో జన్మించిన అలీ.అబుదాబీ కేంద్రంగా పనిచేస్తున్న లులూ గ్రూప్‌కు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.ఈ గ్రూప్ వివిధ దేశాల్లో హైపర్‌మార్కెట్లు నిర్వహిస్తోంది.

మధ్యప్రాచ్యంలో అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా 2021లో యూసుఫ్‌అలీ స్థానం సంపాదించారు.ఇదే సమయంలో గల్ఫ్‌లోని అన్ని దేశాల అధినేతలతో సన్నిహిత సంబంధం వుండటంతో మధ్యప్రాచ్యంలో అత్యంత ప్రభావవంతమైన భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు.

వ్యాపారంలో రాణిస్తూనే.సమాజానికి ఎంతో కొంత సాయం చేస్తున్నారు.దీనిలో భాగంగా గానే కోవిడ్ 19 విపత్కర కాలంలో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.25 కోట్లు, కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 కోట్లు, యూపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు, హర్యానా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం అందించారు.అలాగే మధ్యప్రాచ్యంలో భారతీయుల తరపున పనిచేస్తున్న సామాజిక, సాంస్కృతిక సంస్థలకు కోటి రూపాయలు అందజేశారు.

యూసఫ్ అలీ ఏప్రిల్‌లో కేరళలో విమాన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.కొచ్చిలో ఏప్రిల్ 11న ఆసుపత్రిలో చేరిన బంధువును చూడటానికి యూసుఫ్ అలీ, ఆయన భార్య హెలికాప్టర్‌లో బయల్దేరారు.

షెడ్యూల్ ప్రకారం పనంగడ్లోని ఫిషరీస్ కాలేజీ మైదానంలో హెలికాప్టర్ దిగవలసి ఉంది.కానీ అక్కడికి 200 మీటర్ల దూరంలో ఉన్న చిత్తడి నేల మీద హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది.

అయితే.పక్కనే జాతీయ రహదారి, హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉన్నాయి.

చిత్తడి నేలలోనే హెలికాప్టర్ దిగడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube