కరోనా మహిమ: ఎన్ఆర్ఐ భార్యల ఇక్కట్లు.. సడలింపులతో పాస్‌పోర్టు కేంద్రాలకు పరుగులు  

Nri Brides Punjab Passport Centers - Telugu Nri Brides, Nri Brides Queue Up For Passport As Centers Reopen In Punjab, Passport Centers, Punjab

దేశంలోని అన్ని రంగాలపై కరోనా పెను ప్రభావం చూపిస్తోంది.వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో ఎంతోమంది ఉపాధిని కోల్పోగా, ఇక పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల పరిస్దితి అంతే.

 Nri Brides Punjab Passport Centers

గ్రాండ్‌గా వివాహం చేసుకోవాలని భావించిన వారు చివరికి పది మందితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఇదే సమయంలో ఎన్ఆర్ఐలను పెళ్లి చేసుకున్న యువతుల పరిస్ధితి దారుణంగా తయారైంది.

కరోనాకు ముందే వీరి వివాహాలు అయిపోయాయి.

కరోనా మహిమ: ఎన్ఆర్ఐ భార్యల ఇక్కట్లు.. సడలింపులతో పాస్‌పోర్టు కేంద్రాలకు పరుగులు-Telugu NRI-Telugu Tollywood Photo Image

అయితే ప్రవాస భారతీయులు భార్యను తమతో పాటు విదేశాలకు తీసుకెళ్లాలంటే వీసా, పాస్‌పోర్ట్ వంటి చట్టపరమైన అనుమతులు తప్పనిసరి.

కానీ లాక్‌డౌన్ కారణంగా పాస్‌పోర్ట్ కార్యాలయాలను ప్రభుత్వం మూసివేసింది.దీంతో భర్తలు భార్యలను వదిలిపెట్టి విదేశాలకు వెళ్లిపోయారు.గత రెండు నెలల నుంచి దేశంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను కేంద్రం సడలిస్తూ రావడంతో దేశవ్యాప్తంగా అనేక వ్యాపార సంస్ధలు తిరిగి ప్రారంభమవుతున్నాయి.అక్కడక్కడ పాస్‌పోర్ట్ కేంద్రాలను కూడా తెరవడంతో విదేశాలకు వెళ్లాలనుకునేవారు పాస్‌పోర్ట్ కార్యాలయాలకు పోటెత్తారు.

అయితే అందరికంటే ఎక్కువగా నవ వధువులే అక్కడికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఉదాహరణకు పంజాబ్ రాష్ట్రం జలంధర్ నగరంలో ఉన్న పాస్‌పోర్ట్ కేంద్రంలో మొదటి రోజు 241 మంది కొత్త పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకోగా… ఇందులో 50 మంది కొత్త పెళ్లికూతుళ్లే.ఎన్ఆర్ఐలను పరిణయమాడటంతో .విదేశాలకు వెళ్లేందుకు పాస్‌‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.వీరు నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్న పాస్‌పోర్ట్ కేంద్రాలు తెరుచుకోకపోవడంతో.పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకునేందుకు నవ వధువులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జలంధర్ నగరానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

కరోనా నేపథ్యంలో అధికారులు రోటేషన్ పద్ధతిలో పరిమిత సిబ్బందితోనే విధులు నిర్వర్తిస్తున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nri Brides Punjab Passport Centers Related Telugu News,Photos/Pics,Images..

footer-test