అమెరికాలో తెలుగు విద్యార్ధి దుర్మరణం..   NRI Bhargav Reddy Kethireddy Affected By Heart Attack In America     2018-11-10   18:37:09  IST  Surya

అమెరికాలో గత కొంతకాలం నుంచీ భారత్ కి చెందిన చాలా మంది యువతీ యువకులు అనేకరకాల కారణాల వలన మృత్యువాత పడుతున్నారు…గడిచిన నెల కాలంలో సుమారు ఐదుగురు భారతీయులు చనిపోవడం ఆందోళన కలిగించింది ఇండియాలో ఉన్న ఎన్నారైల కుటుంభ సభ్యులకి..అయితే తాజాగా మరొక భారతీయ తెలుగు యువకుడు తెలంగాణా వాసి అయిన భార్గవ్‌ రెడ్డి ఇత్తిరెడ్డి (25) హటాత్తుగా గుండె పోటుతో మరణించారు.

భార్గవ్‌ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాకు చెందిన వ్యక్తి. నార్త్‌ టెక్సాస్‌ యూనివర్సిటీలో భార్గవ్‌ ఇటీవలే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం టెక్సాస్‌ నుంచి మిన్నెయాపోలీస్‌ నగరానికి కూడా మారాడని అయన సన్నిహితులు తెలిపారు…ఈ సంఘటన జరగగానే భార్గవ్‌రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తున్నామని మార్గమధ్యంలో ఉండగానే ఈ ఘోరం జరిగిందని తెలిపారు.

అతి చిన్న వయస్సులోనే భార్గవ్ ఇలా మృతిచెందడం ఎంతో భాదాకరమని..తోటి వారికి చిన్న ఆపద కలిగినా తట్టుకులేక పోయేవాడని..ఎవరికీ సాయం కావాలన్నా ముందుండే వాడని ఆయన స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. భార్గవ్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.