వారు దేశ ద్రోహులంటూ.. కేసీఆర్ పై ప్రధాని విమర్శలు  !?

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో అడుగుపెట్టారు.నేడు ఆయన హైదరాబాదులో పర్యటిస్తున్నారు.

 Nrendra Modhi Sensational Commnts On Trs Government , Kcr, Telangana, Trs Govern-TeluguStop.com

ప్రధాని నరేంద్ర మోడీ టూర్ తెలంగాణ లో ఈ రోజు ఉందనే ముందస్తు సమాచారం ఉన్నా… తెలంగాణ సీఎం కేసీఆర్  కర్ణాటక కు వెళ్లి పోయారు.అక్కడ మాజీ ప్రధాని దేవ్ గౌడ్ తో సమావేశం అయ్యారు.

ఇదిలా ఉంటే ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.కార్యకర్తలు జోష్ నింపే విధంగా ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ముందుగా ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ బిజెపి నాయకులు,  కార్యకర్తలు భారీ స్థాయిలో ఆయనకు స్వాగతం పలికారు.

బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వం పై ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేశారు.
 

Telugu Modhi Hyderabad, Narndra Modhi, Nrendramodhi, Prime India, Telangana, Trs

 ఈ సందర్భంగా తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.ఎంతోమంది త్యాగాలతో తెలంగాణ వచ్చిందని, అటువంటి త్యాగాలతో వచ్చిన తెలంగాణ ఏ ఒక్క కుటుంబం కోసమో కాదని ప్రధాని వ్యాఖ్యానించారు.  టిఆర్ఎస్ కుటుంబ పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు.

తెలంగాణలో కుటుంబ పాలన చేసేవారు దేశద్రోహులు అంటూ ప్రధాని ఫైర్ అయ్యారు.తెలంగాణలో నెలకొన్న వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మనమంతా పోరాటం చేయాలని బిజెపి కార్యకర్తలు నాయకులకు సూచించారు.

కుటుంబ పార్టీలు ఎటువంటి స్వలాభం కోసం పని చేస్తాయో తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన అంతా అవినీతి మయం అయ్యిందని తెలంగాణలో అధికార మార్పు తథ్యమని ప్రధాని జోస్యం చెప్పారు.ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని భీమా వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటూ వాటికి పేర్లు పెట్టుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube