పాపం : ఈసారి రాజమౌళికి ఏదీ కలిసి రావడం లేదు  

Now Director Rajamouli Facing Bad Time For Rrr-jr Ntr,rajamouli,ram Charan,rrr,rrr Full Name,tollywood Gossips

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత ఇండియాలోనే టాప్‌ డైరెక్టర్‌గా మారిపోయాడు.ఆయన ఏ సినిమా చేసినా దానికి జనాలు నీరాజనాలు పలికేందుకు సిద్దంగా ఉన్నారు.

Now Director Rajamouli Facing Bad Time For Rrr-jr Ntr,rajamouli,ram Charan,rrr,rrr Full Name,tollywood Gossips-Now Director Rajamouli Facing Bad Time For RRR-Jr Ntr Rajamouli Ram Charan Rrr Full Name Tollywood Gossips

ఇలాంటి సమయంలో జక్కన్న ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని మొదలు పెట్టాడు.ఏడాది క్రితమే ఈ సినిమాకు సంబంధించిన వార్తలు వచ్చాయి.సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని జక్కన్న కష్టపడుతున్నాడు.కాని గత సినిమాలతో పోల్చితే ఈ సినిమాకు జక్కన్నకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Now Director Rajamouli Facing Bad Time For Rrr-jr Ntr,rajamouli,ram Charan,rrr,rrr Full Name,tollywood Gossips-Now Director Rajamouli Facing Bad Time For RRR-Jr Ntr Rajamouli Ram Charan Rrr Full Name Tollywood Gossips

ఒక హాలీవుడ్‌ నటిని ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌కు జోడీగా ఎంపిక చేయగా ఆమె కారణం ఏమీ చెప్పకుండానే వెళ్లి పోయింది.ఇక ఏదో విధంగా షూటింగ్‌ జరుపుతుండగా అనూహ్యంగా రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ ఇద్దరికి కూడా గాయాలు అయ్యాయి.

ఆ గాయాల కారణంగా దాదాపు రెండు నెలల పాటు షూటింగ్‌కు పూర్తిగా బ్రేక్‌ ఇచ్చారు.ఇక చరణ్‌ నిర్మాతగా సైరా చిత్రం నిర్మించాడు.ఆ సినిమా విడుదల కార్యక్రమాలు, ప్రమోషన్‌ కార్యక్రమాలు చూసుకోవడం కోసం నెల రోజుల పాటు ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌కు దూరంగా ఉన్నాడు.

ఇప్పుడు జక్కన్న బాహుబలి ప్రత్యేక ప్రదర్శణ కోసం లండన్‌ వెళ్లాడు.దీంతో రెండు వారాల పాటు షూటింగ్‌కు గ్యాప్‌ వచ్చింది.ఇదే సమయంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ ఈ చిత్రంకు ఇచ్చిన డేట్లను జక్కన్న సరిగా వినియోగించుకోలేక పోయాడు.దాంతో ఆమె మళ్లీ తన డేట్లను ఇచ్చేందుక కొంత సమయం కోరుతోంది.ఆమె బాలీవుడ్‌లో మూడు నాలుగు పెద్ద సినిమాల్లో నటిస్తోంది.కనుక ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌కు ఆమె హాజరు అయ్యేందుకు కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే జక్కన్నకు ఈసారి ఏది కలిసి రావడంలేదనిపిస్తుంది.