ఐఫోన్‌–ఆండ్రాయిడ్‌కు వాట్సాప్‌ చాట్‌ ఈజీగా ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు!

దిగ్గజ మెసేంజర్‌ యాప్‌ వాట్సాప్‌ ఓ నయా ఫీచర్‌ను పరిచయం చేయనుంది.ఈ మధ్య వాట్సాప్‌ ప్రతిరోజూ ఏదో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకువస్తూనే ఉంది.

 Now You Can Transfer Ios Files To Android Easily-TeluguStop.com

సరికొత్త ఆప్షన్లు కూడా అందిస్లూ వినియోగదారులకు ఆకట్టుకుంటుంది వాట్సాప్‌.ఇతర మెసేంజర్‌ యాప్‌లకు ఇది చెక్‌ పెడుతూనే ఉంది.

తాజాగా మరో కొత్త ఫీచర్‌ను కూడా వాట్సాప్‌ పరీక్షిస్తుంది.గూగుల్‌ డేటా రీస్టొర్‌ ఆప్షన్‌ ద్వారా సులభంగా వాట్సాప్‌ చాట్‌ను ఐఓఎస్‌ డివైజ్‌ నుంచి ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు.

 Now You Can Transfer Ios Files To Android Easily-ఐఫోన్‌–ఆండ్రాయిడ్‌కు వాట్సాప్‌ చాట్‌ ఈజీగా ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గూగుల్‌ సెర్చ్‌ దిగ్గజం ఓ కొత్త అప్డేడ్‌ను పరిచయం చేసింది.ఆ వివరాలు తెలుసుకుందాం.9 టూ 5 మ్యాక్‌ ఈ ఫీచర్‌ను 1.0.382048734 వెర్షన్‌ను గూగుల్‌ రీస్టొర్‌ యాప్‌ ద్వారా పరిచయం చేసింది.దీనికి గూగుల్‌ ప్లేస్టోర్‌ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ఈ యాప్‌ ద్వారా పాత డివైజ్‌ నుంచి యూఎస్‌బీ కేబుల్‌ వైర్‌ను ఉపయోగించి క్లౌడ్‌ బ్యాకప్‌ చేసుకోవచ్చు.దీంతో కొత్త ఐఫోన్‌ తీసుకున్నాక… పాత ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోనే ఉన్న వాట్సాప్‌ చాట్, ఇమేజెస్, వీడియోస్‌ సులభంగా కొత్త ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.

పాప్‌అప్‌ ఆప్షన్‌ ద్వారా కొత్త ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు డేటాను రీస్టొర్‌ చేసుకునే సెట్టింగ్‌ చేసే వెసులుబాటు ఉంటుంది.డేటా రిస్టోర్‌ టూల్‌ యాప్‌ క్యూఆర్‌ కోడ్‌ను డిస్పే›్ల చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

దీనికి ఆ కోడ్‌ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది.దీంతో సులభంగా ఐఫోన్‌ నుంచి చాట్‌ మైగ్రేషన్‌ స్టార్ట్‌ అవుతుంది.

ఈ ప్రక్రియలో భాగంగా ట్రాన్స్‌ఫర్‌ చేసే ఐఫోన్‌ను అన్‌లాక్‌లో పెట్టాలి.

Telugu #googlesearch, Android, Android Ios, Ios To Android, Move Chats To Android, Technology, Whatsapp Chat, Whatsapp Chat Migration, Whatsapp New Feature-Latest News - Telugu

వాట్సాప్‌ ఓపెన్‌ చేసి ఉండాలి.కేవలం క్యూఆర్‌ కోడ్‌ ద్వారానే కాకుండా…మాన్యువల్‌గా కూడా చాట్‌ను మైగ్రేషన్‌ సులభంగా చేయవచ్చు.దీనికి ముందుగా ఐఫోన్‌లోని వాట్సాప్‌ను ఓపెన్‌ చేసి.

అందులోని సెట్టింగ్‌ సెక్షన్‌లోకి వెళ్లి ‘చాట్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.ఆ తర్వాత ‘మూవ్‌ చాట్స్‌ టూ ఆండ్రాయిడ్‌’ పై క్లిక్‌ చేయాలి.

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ మాదిరిగా ఈ ప్రక్రియ చేసేటపుడు ఐఫోన్‌లోని వాట్సాప్‌ను ఓపెన్‌ చేసి పెట్టాలి.ఈ నయా ఫీచర్‌ను పరిశోధన దశలో ఉంది.

అతి త్వరలో వాట్సాప్‌ కస్టమర్లకు క్రాస్‌ ప్లాట్‌ఫాం సపోర్టును అందుబాటులోకి రానుంది.కానీ, అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు వాట్సాప్‌ యాజమాన్యం.

##GoogleSearch #Android Ios #Android #Ios To Android #WhatsappChat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు