ఎస్‌బీఐ ఖాతాదారులు మీ మొబైల్‌ నంబర్‌ను ఇలా మార్చుకోండి!

మీరు ఎస్‌బీఐ కస్టమర్ల మీ మొబైల్‌ నంబర్‌ను మార్చాలని బ్యాంకుకు వెళ్లదలచుకున్నారా? అయితే, ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు.హాయిగా ఇంట్లోనే కూర్చొ ని నంబర్‌ను యాడ్‌ చేయవచ్చు.

 Now We Can Change Or Update Mobile Number At Home, Sbi, Online Process, Mobile N-TeluguStop.com

కరోనా నేపథ్యంలో బ్యాంకింగ్‌ సేవల గడువును కుదించడంతో ఆన్‌లైన్‌ సేవలను విస్త్రుతం చేస్తున్నాయి బ్యాంకులు.అందుకే ఇది వరకు నామినీ అప్డేట్‌ను పరిచయం చేసిన ఎస్బీఐ తాజాగా ఫోన్‌ నంబర్‌ను యాడ్‌ చేసుకునే వెసులుబాటును కల్పించింది.

ఆ వివరాలు తెలుసుకుందాం.

దీనికి కేవలం మీ వద్ద స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ ఉంటే చాలు.

సులువుగా మొబైల్‌ నెంబర్‌ అప్‌డేట్‌ చేయొచ్చు.దీనికి ఇంటర్నెట్‌ తప్పనిసరి.

మొబైల్‌ నెంబర్‌ అప్‌డేట్‌ చేసేప్పుడు మీ దగ్గర ఏటీఎం కమ్‌ డెబిట్‌ కార్డ్‌ కూడా ఉండాలి.వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ ద్వారా మొబైల్‌ నెంబర్‌ అప్‌డేట్‌ చేయొచ్చు.

మొబైల్‌ నెంబర్‌ మార్చడం ఎలా?

– దీనికి మీరు ఎస్‌బీఐ కస్టమర్‌ అయి ఉండాలి.ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ పై క్లిక్‌ చేయాలి.
–అప్పుడు మీ వివరాలతో అకౌంట్‌లో లాగిన్‌ కావాలి.ఎడమవైపు My Accounts and Profile పైన క్లిక్‌ చేయాలి.
– ఆ తర్వాత ఆ డ్రాప్‌డౌన్‌ మెనూలో Profile పైన క్లిక్‌ చేసి, పర్సనల్‌ డీటెయిల్స్‌ ఎంటర్‌ చేయాలి.ఇక్కడ మీ ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
– మీరు లాగిన్‌ సమయంలో ఉపయోగించిన పాస్‌వర్డ్‌ కాదు.మీరు గతంలో క్రియేట్‌ చేసిన ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ నమోదు చేయాలి.
– ఆ తర్వాత Change Mobile Number Domestic only పైన క్లిక్‌ చేయాలి.
– అప్పుడు కొత్త స్క్రీన్‌ పైన మీ వ్యక్తిగత వివరాలు–మొబైల్‌ నెంబర్‌ అప్‌డేట్‌ అని కనిపిస్తుంది.

Telugu Activate Number, Numbers, Sbiholders, Sbi App, Sbi Customers, Sbi Process

– ఆ తర్వాత మీ కొత్త మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి.మరోసారి కొత్త మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి.
– చివరగా సబ్మిట్‌ పైన క్లిక్‌ చేయాలి.మీ మొబైల్‌ నెంబర్‌ వెరిఫై చేయాలని పాప్‌ అప్‌ మెసేజ్‌ వస్తుంది.దాని పైన క్లిక్‌ చేయాలి.ఆ తర్వాత ఓటీపీ, ఏటీఎం, కాంటాక్ట్‌ సెంటర్‌ అనే మూడు ఆప్ష¯Œ ్స కనిపిస్తాయి.

By OTP on both the Mobile Number అనే ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి.
– మీ అకౌంట్‌ సెలెక్ట్‌ చేసి, ఏటీఎం కార్డు సెలెక్ట్‌ చేయాలి.

మీ ఏటీఎం కార్డు నెంబర్, వేలిడిటీ, కార్డ్‌ హోల్డర్‌ పేరు, పిన్‌ వివరాలు ఎంటర్‌ చేయాలి.
– అప్పుడు ఓటీపీ, రిఫరెన్స్‌ నెంబర్‌ మీ పాత మొబైల్‌ నెంబర్‌కు వస్తుంది.
– ఆ తర్వాత ACTIVATE అని టైప్‌ చేసి 8 అంకెల ఓటీపీ టైప్‌ చేసి 13 అంకెల రిఫరెన్స్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి 567676 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపాలి.
– ఈ ఫార్మాట్‌లో మీ రెండు మొబైల్‌ నెంబర్ల నుంచి 4 గంటల్లో ఎస్‌ఎంఎస్‌ పంపాలి.
– మీ ఓటీపీ వెరిఫై అయిన తర్వాత మీ మొబైల్‌ నెంబర్‌ సక్సెస్‌ఫుల్‌గా అప్‌డేట్‌ అవుతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube