ఇక‌పై ట్రైన్ టికెట్ బుకింగ్‌లో న‌యా రూల్స్‌.. టికెట్ కావాలంటే ఇలా చేయాల్సిందే..!

క‌రోనా కట్టడికి విధించిన లాక్ డౌన్‌లో రవాణా వ్యవస్థలైన బస్, రైల్వేలు బంద్ అయ్యాయ‌ని మ‌న‌కు తెలిసిందే.ఇటీవ‌ల రైళ్లు, బస్సులు ప్రారంభ‌మ‌య్యాయి.

 Now The New Rules In Train Ticket Booking If You Want A Ticket-TeluguStop.com

దాంతో ప్ర‌జ‌లు ర‌వాణా వైపు మొగ్గు చూపుతున్నారు.దాంతో, భారత రైల్వే శాఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విధానంలో కొత్త నియమాలు అమ‌లులోకి తెచ్చింది అవేమిటంటే ప్రస్తుతం ఆన్ లైన్‌కు అలవాటుప‌డ్డారు ప్రజలు.

ప్రతి ఒక్క‌రూ ఆన్‌లైన్ నే ఇష్ట‌ప‌డుతున్నారు.ఈ క్ర‌మంలో ఎక్కువ‌గా ఆన్‌లైన్ బుకింగ్స్ చేసుకుంటున్నారు.

 Now The New Rules In Train Ticket Booking If You Want A Ticket-ఇక‌పై ట్రైన్ టికెట్ బుకింగ్‌లో న‌యా రూల్స్‌.. టికెట్ కావాలంటే ఇలా చేయాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వారందరూ ఇప్పుడు కొత్త నిబంధ‌న‌లు పాటించాల్సిందే.ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రయాణికుల కోసం ఈ రూల్స్ అమలులోకి తెచ్చింది.

ఇకపై ఆన్‌లైన్ ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకోవాలంటే తమ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీతో వెరిఫికేషన్ త‌ప్ప‌నిస‌రిగా చేయించుకోవాలి.

వెరిఫికేషన్ పూర్త‌య్యాక‌నే తమ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసుకోవ‌చ్చు.

దీని కోసం 50 సెకన్ల నుంచి 60 సెకన్ల సమయం పడుతుంది.అయితే బుకింగ్ కోసం ప్రయాణికులందరూ మొద‌ట‌గా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.

అకౌంట్ లో భాగంగా లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.తమ రిజిస్టర్డ్ ఈమెయిల్, మొబైల్ నెంబర్ ను అందులో ఎంట‌ర్ చేయాలి.

ఈ రెండు చేసిన తర్వాతనే రైలు టికెట్ బుకింగ్ చేసుకోవ‌చ్చు.అయితే క్రియేట్ చేసే విధానం ఎలాగా ఉంటుందంట ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో లాగిన అయిన తర్వాత న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది.

రిజిస్టర్డ్‌ మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రారంభ‌మ‌వుతుంది.Telugu Adhar Number Link, Creat A Pass Word, Irctc Portal, Link Email Id, Login, Mobile Number, New Rules, Train Ticket Booking-Latest News - Telugu

పేజీలో కుడివైపు సెక్షన్‌లో వెరిఫికేష‌న్‌పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత పేజీలో ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ను ఎంట‌ర్ చేయాలి.ఒకవేళ ఆధార్‌ వివరాలు లేక వేరే వివ‌రాలు సరిగా లేకుంటే అప్‌డేట్ కూడా చేసుకోవచ్చు.అప్‌డేట్ చేసుకోవాలటే ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.త‌ర్వాత పూర్తి వివరాలు ఎంట‌ర్ చేశాక మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వచ్చాక, అది ఎంటర్ చేస్తే వెరిఫికేష‌న్ ప్ర్ర్ర‌క్రియ పూర్తవుతుంది.

#Irctc Portal #Link Email Id #Mobile Number #New Rules #Login

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు