ఇక శైలజ రెడ్డి అల్లుడు ఏం చేస్తాడో..  

ఈమద్య కాలంలో ఎక్కువ శాతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రాలు ‘శ్రీనివాస కళ్యాణం’, ‘గీత గోవిందం’, ‘శైలజ రెడ్డి అల్లుడు’. మొదటి రెండు చిత్రాలు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. శ్రీనివాస కళ్యాణం చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. పెళ్లి యొక్క గొప్పదనంను చెప్పడంతో పాటు, కుటుంబ విలువలు బాగా చూపించడం ఖాయం అంటూ ఆ చిత్రం గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కాని ఫలితం తారు మారు అయ్యింది.

Now Tern Is Sailaja Reddy Alludu-

Now Tern Is Sailaja Reddy Alludu

ఇక తాజాగా గీత గోవిందం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్‌ దేవరకొండ మరియు రష్మిక జంటగా తెరకెక్కిన గీత గోవిందం చిత్రం ప్రేక్షకులు ఊహించుకున్న దానికంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌ చేయడంతో పాటు, నిర్మాతలు అంచనా వేసుకున్న కలెక్షన్స్‌కు రెట్టింపు కలెక్షన్స్‌ వస్తున్నాయి. ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల జాబితాలో గీత గోవిందం చేరిపోయిందని చెప్పుకోవచ్చు. గీత గోవిందం చిత్రంతో విజయ్‌ దేవరకొండ స్థాయి అమాంతం పెరిగి పోయింది.

ఇక మిగిలి ఉన్న శైలజ రెడ్డి అల్లుడు చిత్రం ఫలితం గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా అను ఎమాన్యూల్‌ నటించగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంను విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

Now Tern Is Sailaja Reddy Alludu-

మారుతి దర్శకత్వంలో ఈమద్య కాలంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ చిత్రం కూడా అదే సెంటిమెంట్‌తో సక్సెస్‌ అవ్వడం ఖాయం అని భావిస్తున్నారు. నాగచైతన్యకు ఈ చిత్రం సక్సెస్‌ చాలా కీలకం. గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్‌ లేకపోవడంతో నాగచైతన్య ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి. ఆగస్టు 31న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఆగస్టు నెలపై దండెత్తి వచ్చిన రెండు చిత్రాల్లో ఒకటి ఫ్లాప్‌ అవ్వగా మరోటి సక్సెస్‌ అయ్యింది. మరి శైలజ రెడ్డి అల్లుడి పరిస్థితి ఏంటో చూడాలి.