కరోనా ఎఫెక్ట్ : ఇక నుంచి ఆ సేవలు నాలుగు గంటల సేపు మాత్రమే...  

Now On Words Banks Will Work Only 4 Hours In India - Telugu Banking Hours News,, Rbl Bank News, Rbl Bank News, Rbl Banking Hours News, Sbi

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతగా కలకలం సృష్టిస్తున్న సంగతి చెప్పనవసరం లేదు.అయితే ఇప్పటికే ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల పారిశ్రామిక రంగాలు పడటంతో కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు.

 Now On Words Banks Will Work Only 4 Hours In India - Telugu Banking News Rbl Bank Sbi

మరి కొన్ని సంస్థలైతే ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.అయితే తాజాగా ఈ కరోనా వైరస్ ప్రభావం ఈ విషయంపై కూడా పడినట్లు తెలుస్తోంది అందువల్ల రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ (ఆర్బీఎల్)  పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇందులో భాగంగా నేటి నుంచి 31వ తారీఖు వరకుకూ రోజుకి కేవలం నాలుగు గంటల సేపు మాత్రమే  బ్యాంక్ సిబ్బంది అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపింది. అలాగే ఖాతాదారులని కూడా అత్యవసర పరిస్థితులు ఏమైనా ఉంటే తప్ప ఇతర సమయాల్లో బ్యాంకులకు రావద్దని సూచించింది.

ఇప్పటికే అన్ని బ్యాంకులకు సంబంధించి దాదాపుగా నగదు చెల్లింపులు మరియు లావాదేవీలు వంటి వాటి కోసం ఆన్ లైన్ బ్యాంకింగ్ సదుపాయాలని ఉపయోగించుకోవాలని తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ కరోనా వైరస్ వల్ల దేశంలోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ని ప్రకటించారు.దీంతో ప్రస్తుతం ప్రజలు అందరూ ఇంటికి పరిమితం అవుతున్నారు.ఈ లాక్ డౌన్ కార్యక్రమం ఈ నెల 31వ తారీకు వరకు కొనసాగనుంది.

అయితే ఆ తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగితే ఈ లాక్ డౌన్ మరింత కాలం పాటు పొడిగించాలని ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.

తాజా వార్తలు

Now On Words Banks Will Work Only 4 Hours In India Related Telugu News,Photos/Pics,Images..