ఇప్పుడు నేనున్నా లావుకు ఫోటోలు కూడానా.. ప్రణీత సుభాష్ పోస్ట్ వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన కన్నడ బ్యూటీ ప్రణీత గురించి అందరికీ పరిచయమే.తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

 Now Iam Fat No More Photos Praneetha Subhash Post Viral Details, Tollywood, Pran-TeluguStop.com

ఏం పిల్లో.ఏం పిల్లడో అనే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.

ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఆ తర్వాత బ్రహ్మోత్సవం, రభస వంటి పలు సినిమాలలో నటించింది.కానీ ఎందుకో టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా మెప్పించలేకపోయింది.ఈమె టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది.అంతేకాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి తనేంటో నిరూపించుకుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ గతంలో కోవిడ్ సమయంలో కూడా ఎంతో మంది ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.

ప్రణీత ఫౌండేషన్ పేరు మీద ఇప్పటికీ చాలా మందికి సహాయం చేస్తూనే ఉంది.

ఇక ఈమె బాలీవుడ్ లో మంచి సక్సెస్ లో ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బడా బిజినెస్ మాన్ ను అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది.ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ప్రణీత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.

Telugu Pranitha, Nithin Raj, Praneetha, Tollywood-Movie

అప్పుడప్పుడూ తన వ్యక్తిగత విషయాలను, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక తనకు సంబంధించిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

ఈమధ్య తన కూతురు ఫోటోలను కూడా పంచుకుంటుంది.తన ఫాలోవర్స్ తో కూడా బాగా ముచ్చట్లు పెడుతుంది.

ఇటీవల తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టగా అందులో చాలామంది తన కూతురు గురించి, తన ప్రాజెక్టుల గురించి ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకున్నారు.

Telugu Pranitha, Nithin Raj, Praneetha, Tollywood-Movie

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.ఈమె నిత్యం ఫోటోషూట్లు చేయటంతో.తన ఫాలోవర్ మరోసారి తనని ఫోటో షూట్ లు చేయమని మిస్ అవుతున్నాము అని అడిగాడు.దాంతో ప్రణీత వెంటనే.ఇప్పుడు నేనున్న లావుకు ఫోటోలు కూడానా అంటూ సమాధానం ఇచ్చింది.ఇక ఆ సమాధానం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.కొందరు తన కూతురు గురించి కూడా ప్రశ్నలు వేస్తూ సమాధానం తెలుసుకున్నారు.

ఇదంతా పక్కన పెడితే తను మళ్లీ సినిమాల్లోకి రి ఎంట్రీ ఇస్తుందో లేదో అని అనుమానాలు ఎదురవుతున్నాయి.కానీ తాను మాత్రం ప్రస్తుతం ఫ్యామిలీతో బాగా బిజీగా ఉందని.

ఈ సమయంలో తన కూతురికి దగ్గరగా తాను ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తుంది.మరి ఈ ముద్దుగుమ్మ తన అభిమానుల కోసం మళ్లీ సినిమాల్లో అడుగుపెడుతుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube