ఏపీ పశుసంవర్ధక శాఖ వినూత్న ప్రయోగం,పశువులకు కూడా ఆధార్!

ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది ఉండాలని,దానిని బ్యాంక్ ఎకౌంట్స్ కు కూడా జతచేయాలి అంటూ కేంద్రం రూల్స్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.ఈ ఆధార్ కార్డ్ ద్వారా ఆ వ్యక్తికి సంబందించిన అన్ని విషయాలను కూడా తెలుసుకొనే వీలు కలుగుతుంది.

 Now Cows And Buffaloes Will Have Aadhaar Too-TeluguStop.com

అయితే ఈ ఆధార్ కార్డు ప్రక్రియ ఇప్పుడు పశువులకు కూడా కల్పించాలి అని ఏపీ పశుసంవర్ధక శాఖ వినూత్న ప్రయత్నానికి తెరలేపింది.కేంద్రం సహాయంతో ఈ ఆధార్ గుర్తింపు ఇవ్వబోతున్నది.

పశువులకు ఆధార్ ఈ ట్యాగ్ ను వేస్తున్నారు.ఈ ట్యాగ్ వేయడం ద్వారా.

దేశంలో ఎక్కడి నుంచైనా పశువుల వ్యాపారం చేసుకునే అవకాశం ఉండడం తో పాటు పశువుకు సంబందించిన అన్ని విషయాలు కూడా వెల్లడవుతాయి.ఈ కోడ్ లను ఈనాఫ్ యాప్ కు అనుసంధానం చేస్తున్నారు.

ఈ యాప్ ద్వారా పశువులకు ఎద ఇంజక్షన్లు ఎప్పుడు ఇవ్వాలి, చూడు నిర్ధారణ, ఎప్పుడు దూడను ఈనుతుంది, ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి, ఎంతకాలం ఇస్తాయి, ఏఏ జబ్బు లు ఉన్నాయి, ఏమి మందులు వాడాలి అనే అంశాలు అన్నీ కూడా ఇందులో నమోదు చేస్తారు.దీనితో ఈ ఆధార్ కోడ్ ద్వారా ఆ పశువుకు సంబందించిన అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అన్నమాట.

అంతేకాకుండా ఒకవేళ పశువుల అపహరణ జరిగినా ఈ ట్యాగ్ ద్వారా అవి ఎక్కడ ఉన్నాయి అనే విషయాలను కూడా ఇట్టే తెలుసుకోవచ్చు.ఎన్నో బహుళ ప్రయోజనాలు ఉండటంతో దీనిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.

ఇక ఇప్పుడు మనుషులతో పాటు పశువులకు కూడా ఆధార్ ఉండబోతుంది అన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube