ఏపీ లో తెర మీదకు కొత్త చర్చ..ఎవరిదీ పాపం     2018-07-06   04:13:16  IST  Bhanu C

ఏపీకి ఎవరు అన్యాయం చేశారు..? కేంద్రమా ..రాష్ట్రమా ..? అనే కొత్త చర్చ ఇప్పుడు మొదలయ్యింది. రాష్ట్ర విభజన అయినా తరువాతే బీజేపీ- టీడీపీ పొత్తు మొదలయ్యింది. నాలుగేళ్లపాటు ఇరు పార్టీలు చెట్ట పట్టాలు వేసుకుని మరీ తిరిగాయి. ఆ సమయంలో ఎప్పుడూ ఏపీ స్పెషల్ స్టేటస్ గురించి పెద్దగా ఇరు పార్టీలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ మధ్యనే ఇరు పార్టీల పొత్తు పెటాకులయ్యింది. ఈ నేపథ్యంలోనే ఏపి ప్ర‌యోజ‌నాల విష‌యంలో కేంద్రం తాజాగా కోర్టులో దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ తో ఏపీకి కేంద్రం చేసేది ఏమీ లేదని అర్ధం అయిపోయింది ఈ దశలోనే ఈ కొత్త చర్చ తెరమీదకు వచ్చింది.

రాష్ట్రానికి కేంద్రం ఎప్పుడూ మొండి చేయి చూపిస్తూనే వస్తోంది. విశాఖ రైల్వే జోన్ .. రాజ‌ధాని నిర్మాణం, క‌డప‌ స్టీల్ ఫ్యాక్ట‌రీ, రెవెన్యూ లోటు ఇలాంటివి ఏపీకి దీర్ఘకాల ప్రయోజనాలు చేకూర్చే అంశాలు. కానీ ఇలాంటివి ఏవి కూడా ఇచ్చే ఉద్దేశ్యంలో కేంద్రం లేదు. ఇస్తాన‌ని ఏనాడూ చెప్ప‌లేదు . ఇక పోల‌వ‌రం నిర్మాణ వ్య‌యం విష‌యంలో 2014కు ముందు ప్రాజెక్టుపై పెట్టిన ఖ‌ర్చు ఇచ్చేది లేద‌ని కేంద్ర‌మంత్రి అరుణ్ జైట్లీ ఎప్పుడో ప్రకటించేశాడు కూడా.

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని స్వయంగా కోర్టుకే చెప్పేసింది కేంద్రం. ఆ తరువాతే చంద్రబాబు గొంతు చించుకుంటున్నారు. నాలుగేళ్ళుగా రాష్ట్రంలోని ప్ర‌తీ ఒక్క‌రికీ తెలిసినవే. కాక‌పోతే చంద్ర‌బాబే కొత్త డ్రామాలు మొద‌లుపెట్టారు. కేంద్రం వైఖ‌రేంటో కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన త‌ర్వాత స్ప‌ష్ట‌మైన‌ట్లు చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు చేయ‌టం విచిత్రంగా కనిపిస్తోంది.

చంద్ర‌బాబు నాలుగేళ్ళ‌ల్లో ఏనాడు కేంద్రాన్ని నిల‌దీసింది లేదు. మ‌రి ఇపుడే ఎందుకంత గొంతు చించుకుంటున్నారంటే రానున్న ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే అన్న‌ది స్ప‌ష్టం. నాలుగేళ్ళ‌పాటు బిజెపితో అంత‌కాగిన చంద్రబాబుపై జ‌నాల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చేసింది. ఆ విష‌యం చంద్ర‌బాబుకు కూడా అర్ధ‌మైంది. ఇంకా బీజేపీ క‌లుసుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓటమి తప్పదని తెలుసుకునే బాబు బయటకి వచ్చేసారు. . రాష్ట్రాభివృద్ధికి తాను కష్ట‌ప‌డుతుంటే కేంద్రం అడ్డుకుంటోందంటూ బిల్డ‌పులు ఇస్తున్నారు. ప‌నిలో ప‌నిగా బిజెపితో పాటు వైసిపిని కూడా జ‌నాల దృష్టిలొ దోషిగా నిల‌బెట్టేందుకు డ్రామాలు మొద‌లుపెట్టారు. ఏది ఏమైనా ఏపీకి అన్యాయం చేసిన వారిలో బీజేపీ – టీడీపీ రెండు పార్టీలు దోషులుగానే మిగిలిపోయాయి అనేది వాస్తవం.