నవంబర్‌ 10న ఓపెన్‌కు ముహూర్తం కుదిరింది

దేశ వ్యాప్తంగా థియేటర్ల ఓపెన్‌ కు గత నెలలోనే ప్రభుత్వం నుండి అనుమతి వచ్చింది.కాని కరోనా కేసుల నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాల్లో థియేటర్ల ఓపెన్‌ కు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం లేదు.

 November 10 Theaters Going To Open Permission Given By Tamilnadu Government, Tam-TeluguStop.com

మల్టీ ప్లెక్స్‌ థియేటర్లు అక్కడక్కడ ఓపెన్‌ అయినా పూర్తి స్థాయిలో మాత్రం థియేటర్లు ఎక్కడ కూడా ఓపెన్‌ అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.తమిళనాడులో థియేటర్లను ఓపెన్‌ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడు నిర్మాతలు ఒత్తిడి చేయడంతో ప్రభుత్వం థియేటర్ల ఓపెన్‌కు ఓకే చెప్పిందట.నవంబర్‌ 10వ తారీకు నుండి 50 శాతం ఆక్యుపెన్సీతో పూర్తి స్థాయిలో థియేటర్లను ఓపెన్‌ చేయవచ్చు అంటూ అధికారికంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

దాంతో తమిళనాడులోని దాదాపు 95 శాతం థియేటర్లు ఓపెన్‌ కాబోతున్నాయి.
ఈనెల 10 నుండి థియేటర్లు నడిచినా కూడా కొత్త సినిమాలు విడుదల అయ్యే అవకాశం కనిపించడం లేదు.

డిసెంబర్‌లో కొత్త సినిమాలు థియేటర్లకు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ప్రస్తుతం పాత సినిమాలనే మళ్లీ స్క్రీనింగ్‌ చేసేందుకు థియేటర్ల యాజమాన్యాలు ప్లాన్‌ చేస్తున్నాయి.ఒకటి రెండు ఓటీటీ సినిమాలను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.మొత్తానికి ఈనెల 10వ తారీకున థియేటర్లు ఓపెన్‌ చేస్తే ఖచ్చితంగా డిసెంబర్‌ నుండి ప్రేక్షకులు గతంలో మాదిరిగా థియేటర్ల వద్ద బారులు తీరే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రస్తుతం థియేటర్లలో 50 శాతం సీట్లకు మార్కింగ్‌ చేయడంతో పాటు కరోనా జాగ్రత్తలు తీసుకునే పనిలో ఉన్నారు.ఏపీ మరియు తెలంగాణలో ఈ ఏడాది చివర్లో థియేటర్లు ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.

కర్ణాటకలో ఇప్పటికే 75 శాతం థియేటర్లు నడుస్తున్నాయి.అవి నష్టాల్లో కొనసాగుతన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను నష్టాలతో అయినా ఓపెన్‌ చేయాలని భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube