40 సంవత్సరాల క్రితమే నవలలో కరోనా ప్రస్తావన... ఏమని రాశారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే...?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.దాదాపు 70,000 మంది ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడ్డారు.

 Novel Predicted Wuhan Corona Virus 40 Years Before 40-TeluguStop.com

కరోనా వైరస్ గురించి మనకు ఈ మధ్య కాలంలోనే తెలిసినప్పటికీ ఒక రచయిత మాత్రం దాదాపు 40 సంవత్సరాల క్రిందటే కరోనా వైరస్ గురించి ఊహించారు.ఒక రచయిత దాదాపు 40 సంవత్సరాల క్రితం రాసిన నవల గురించి ఒక ట్విట్టర్ యూజర్ నవల వివరాలను తెలుపుతూ ఫోటోలను ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ట్వీట్ గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది.ఆ నవలలో కరోనా వైరస్ గురించి కరోనా వైరస్ మనుషులను చంపటానికి సరైన ఆయుధమని, మనుషుల శరీరంలో మాత్రమే కరోనా వైరస్ బ్రతుకుతుందని కరోనా వైరస్ మనిషి శరీరం నుండి బయటకు వస్తే మాత్రం కొన్ని సెకన్ల సమయం పాటు కూడా జీవించదని రచయిత పేర్కొన్నారు.

Telugu Corona, Novel, Novelwuhan, Novelist-

ఆ రచయిత వూహాన్ 400 పేరుతో కరోనా వైరస్ కు సంబంధించిన వివరాలను ఖచ్చితంగా చెప్పటంతో ఆశ్చర్యపోవటం ప్రజల వంతవుతోంది.దాదాపు 40 సంవత్సరాల క్రితమే ఇంత ఖచ్చితంగా పేర్లతో సహా చెప్పాడంటే ఆ రచయిత ఊహాశక్తి గొప్పదని కామెంట్లు చేస్తున్నారు.కొందరు మాత్రం ఎవరో కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.ఈ నవలకు సంబంధించిన నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube