చివరికి తన నేరం ఒప్పుకున్న టెన్నిస్ స్టార్ జకోవిచ్‌..

Novac Djokovic Admits His Mistake Over Covid Positive In Australian Open

ప్రపంచ నంబర్‌ వన్‌ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ చిక్కుల్లో పడ్డాడు.జైలుకు వెళ్లే పరిస్థితి కొని తెచ్చుకున్నాడు.

 Novac Djokovic Admits His Mistake Over Covid Positive In Australian Open-TeluguStop.com

అంతేకాకుండా భారీ జరిమానా చెల్లించాల్సిన స్థితికి వచ్చేశాడు.వివరాల్లోకి వెళ్తే.

టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ చిక్కుల్లో పడ్డాడు.గత నెలలో తనకు కరోనా సోకగా వ్యాక్సిన్ వేయించుకునే సమయం లేకపోయిందనే కారణంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం నుండి జకోవిచ్ మినహాయింపు పొందాడు.

 Novac Djokovic Admits His Mistake Over Covid Positive In Australian Open-చివరికి తన నేరం ఒప్పుకున్న టెన్నిస్ స్టార్ జకోవిచ్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా, జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు గత గురువారం మెల్‌బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.అక్కడ అతడికి చాంపియన్ స్వాగతం లభించాల్సి ఉండగా.

, అందుకు విరుద్ధంగా తీవ్ర అవమానం జరిగింది.

ఆస్ట్రేలియాలో కొవిడ్‌ ఆంక్షలు కఠినంగా ఉన్నాయి.

పాజిటివ్‌ వచ్చిన వాళ్లు వైద్య ధ్రువీకరణ పత్రం చూపిస్తే దేశంలోని అనుమతి ఇస్తున్నారు.కానీ జకోవిచ్‌ అలాంటి పత్రం ఇవ్వలేదు.

కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించాడని, నిర్దిష్ట కారణాలు చూపకుండా వ్యాక్సినేషన్ నుంచి మినహాయింపు పొందాడని ఆరోపిస్తూ ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడి వీసాను రద్దు చేశారు.అంతేకాకుండా ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించి నిర్బంధించారు.

చివరకు కోర్టును ఆశ్రయించిన సెర్బియన్ తాను చేసింది పొరబాటేనని అంగీకరిస్తూ ఒక ప్రకటన చేసాడు.

దీంతో జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడేది, లేనిది ఇవాళ తేలనుంది.కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారులు జకోవిచ్ సమర్పించిన పత్రాలను తనిఖీ చేస్తున్నారు.ఒకవేళ తప్పుడు ధ్రువపత్రాలు సమర్పిస్తే ఆ నేరం కింద జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

కాగా, జకోవిచ్ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను విడుదల చేస్తూ, ఆస్ట్రేలియాలో తన ఉనికి గురించి విస్తృతంగా ఉన్న ప్రజల ఆందోళనను తగ్గించడానికి తప్పుడు సమాచారాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.

నేను స్పీడ్ టెస్టులు చేయించాను, దాని ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి.తర్వాత పరీక్షలో పాజిటివ్ అని తేలింది.కాబట్టి నాకు కరోనా లక్షణాలు లేకపోయినా జాగ్రత్తలు తీసుకున్నాను.

నా ప్రయాణ పత్రాలలో చేసిన పొరపాటును నా మద్దతు బృందం సమర్పించింది’ అంటూ పేర్కొన్నాడు.

novac djokovic admits his mistake over covid positive in australian open details, Tennis star, Australia player, latest news, viral latest news viral, novac djokovic ,admits his mistake ,covid positive ,australian open, tennis player novac djokovic, australia - Telugu Admits, Australia, Australian, Covid, Latest, Novac Djokovic, Tennisnovac, Tennis

#Australia #Australian #Australia #TennisNovac #Novac Djokovic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube