సోషల్, కమ్యూనిటీ సర్వీస్ వర్కర్లకు కెనడా ప్రావిన్స్ ఆహ్వానం

సోషల్, కమ్యూనిటి సర్వీస్ విభాగాల్లో అనుభవం ఉన్న ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ దరఖాస్తుదారులకు కెనడాలోని నోవా స్కోటియా ప్రావిన్స్ తన లేబర్ మార్కెట్ ప్రియారిటీస్ స్ట్రీమ్ ద్వారా ఆహ్వానాలు పలికింది.ఇమ్మిగ్రెంట్ నామినీ ప్రోగ్రామ్, ఎన్ఎస్‌ఎన్‌పీ, నిర్ధిష్ట పని అనుభవం ఉన్న అభ్యర్ధులను ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌ కింద సెర్చ్ చేయడానికి లేబర్ మార్కెట్ ప్రియారిటీస్ స్ట్రీమ్‌లో నోవా స్కోటియాను అనుమతిస్తుంది.

 Nova Scotia Draws Social And Community Service Workers-TeluguStop.com

లేబర్ మార్కెట్ ప్రియారిటీస్ స్ట్రీమ్ కింద ఎన్ఎస్‌ఎన్‌పీకి డిసెంబర్ 5 జరిగిన డ్రా ఆరవది.ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ డ్రా ద్వారా గతంలో జరిగిన డ్రాలలో అనుభవమున్న నర్సులు, వడ్రంగి, ఫైనాన్షియల్ ఆడిటర్లు, అకౌంటెంట్లను లక్ష్యంగా చేసుకున్నాయి.

కెనడా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టమ్ కింద ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ క్లాస్, ఫెడరల్ స్కిల్డ్ ట్రేడ్స్ క్లాస్, కెనడియన్ ఎక్స్‌పిరియన్స్ క్లాస్ ఇమ్మిగ్రేషన్ పాలసీలను నిర్వహిస్తుంది.

Telugu Canada, Nova Scotia, Community, Telugu Nri Ups-

ప్రావిన్షియల్ నామినేషన్ పొందిన ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అభ్యర్ధులకు వారి ర్యాంకింగ్ స్కోరుకు అదనంగా 600 పాయింట్లు లభిస్తాయి.దీని ఫలితంగా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ నుంచి తదుపరి డ్రాలో కెనడా శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితమైన హామీ లభిస్తుంది.డిసెంబర్ 5న జరిగిన ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ డ్రా నేషనల్ ఆక్యుపేషనల్ క్లాసిఫికేషన్ (ఎన్ఓసీ) 4212, సోషల్ అండ్ కమ్యూనిటీ సర్వీస్‌లో అనుభవమున్న అభ్యర్ధులను లక్ష్యంగా చేసుకుంది.

లేబర్ మార్కెట్ ప్రియారిటీస్ స్ట్రీమ్ ద్వారా ఎంపికైన అభ్యర్ధులకు ప్రావిన్స్‌లో ఎలాంటి ఉద్యోగ ఆఫర్ అవసరం లేదు.ఎన్ఎస్‌ఎన్‌పీ కింద ఎంపిక చేసిన అభ్యర్ధులు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను స్వీకరిస్తారు.

అనంతరం వారి దరఖాస్తును సమర్పించడానికి లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల గడువు వుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube