ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party )కి కష్ట కాలంలో ఉన్నట్టు గా పరిస్థితులు నెలకొన్నాయి.ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు ( Chandrababu arrest )కాగా, ఏసీ ఫైబర్ గ్రిడ్ స్కాం లోకేష్ పాత్ర ఉందని ఇప్పటికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు .
ఇక కోర్టు ఆదేశాలతో లోకేష్ కు నోటీసులు జారీ అయ్యాయి.సిఐడి ఆయనను విచారించేందుకు ఏర్పాట్లు చేస్తుంది .ఇది ఇలా ఉండగానే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కామ్ లో మాజీమంత్రి, టిడిపి కీలక నేత పొంగులేటి నారాయణ పేరు సైతం తెరపైకి వచ్చింది .ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది .

తాజాగా ఆయనకు ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది.అక్టోబర్ 4 తమ ఎదుట ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సిఐడి పేర్కొంది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం లో ఏ 2 గా నారాయణ ఉన్నారు.హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మీద ప్రస్తుతం బయట ఉన్నారు.ఇదే కేసులో సిఐడి విచారణ వేగవంతం చేయడంతో, ఆయన అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.ఇక టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )సైతం ఈ స్కామ్ లో ఉన్నట్లుగా సిఐడి నిర్ధారించింది.
లోకేష్ కు సైతం అక్టోబర్ 4 తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఢిల్లీ వెళ్లి మరి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు .ఇప్పుడు అదే తేదీన నారాయణ సైతం విచారణకు హాజరవుతుండడంతో ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో ఇద్దరిని కలిసి విచారించే అవకాశం కనిపిస్తోంది ..

గత టిడిపి ప్రభుత్వ హయాంలో అమరావతి మాస్టర్ ప్లాన్ లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంట్లో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట జరిగిన భారీ అవినీతి దర్యాప్తు వెలుగు చూసింది. ఏ 1 గా చంద్రబాబునాయుడు పేరును ఏ 2 గా మాజీ మంత్రి నారాయణ పేరును ఈ కేసులో చేర్చింది.
ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టు కాగా , ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం( Inner ring road scam ) కేసులో నారాయణతో పాటు , లోకేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.