డ్రగ్స్‌ కేసులో తెలుగు హీరోకు నోటీసులు

డ్రగ్స్ రాకెట్‌ వ్యవహారం నిన్న మొన్నటి వరకు కన్నడ సినిమా పరిశ్రమ ప్రముఖులను ఇబ్బందికి గురి చేసిన విషయం తెల్సిందే.ఇద్దరు హీరోయిన్ లు జైలు లో కూడా ఉన్నారు.

 Notices For Telugu Hero Thaneesh About Bengaluru Drugs Case , Bollywood Drugs Ca-TeluguStop.com

బాలీవుడ్ ప్రముఖుల నుండి కన్నడ సినీ ప్రముఖుల వరకు ఎంతో మంది డ్రగ్స్‌ కేసులో మెల్ల మెల్లగా బయట పడ్డ వారు ఉన్నారు.విచారణ ఎదుర్కొంటూ కొందరు బయట పడుతూ ఉంటే మరి కొందరు మాత్రం ఇరుక్కుని జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది.

బెంగళూరు డ్రగ్స్‌ కేసు లో తెలుగు హీరో తనీష్‌ కు కూడా నోటీసులు అందాయి.ఆయన ఒక కన్నడ సినీ నిర్మాత ఇచ్చిన నైట్‌ పార్టీ లో పాల్గొన్నాడు.

ఆ సమయంలో తనీష్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారాలు లభ్యం అయ్యాయి.దానికి తోడు డ్రగ్స్ విషయమై ఆయనకు సంబంధించిన వివరాలను ఎలా సేకరించాడు ఎలా అలవాటు అనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు ఎంక్వౌరీ మొదలు పెట్టారు.

నోటీసులు అందుకున్న తనీష్ అతి త్వరలోనే నోటీసులకు రిప్లై ఇవ్వడంతో పాటు బెంగళూరులో విచారణకు హాజరు అవ్వాల్సి ఉంటుందని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.పెద్ద ఎత్తున ఈ కేసులో ప్రముఖులు ఉన్న నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు కూడా దీనికి సంబంధించిన విషయాలపై దృష్టి పెడుతున్నారని అంటున్నారు.

కన్నడకు చెందిన ఒక రాజకీయ ప్రముఖుడి తనయుడు ఈ కేసు తో సంబంధం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.కాని ఆయన కు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదు.

కాని తనీష్ తో పాటు ఇతరులకు మాత్రం విచారణ అధికారులు నోటీసులను పంపించారు.గతంలో కూడా డ్రగ్స్ కేసులో తనీష్‌ విచారణ ఎదుర్కొన్నాడు.

ఆ కేసు నీరు గారి పోయింది.ఎవరు కూడా ఆ కేసులో అరెస్ట్‌ అవ్వడం కాని ఏమీ జరగలేదు.

కాని బెంగళూరు డ్రగ్స్ కేసు అలా కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కనుక తనీష్‌ పరిస్థితి ఏంటా అంటూ ఆందోళన వ్యక్తం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube