హైద‌రాబాదీయుల మ‌రో ఘ‌న‌త‌.. ఏసీ హెల్మెట్ వ‌చ్చేసింది..

మ‌నం బైక్ వేసుకుని రోడ్డు మీద‌కు వ‌చ్చామంటే చాలు క‌చ్చితంగా త‌ల‌కు హెల్మెట్ ఉండాల్సిందే.ఇది ఉంటే ఎలాంటి ప్ర‌మాదం నుంచి అయినా ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చు.

 Another Seriousness Of Hyderabadis   Ac Helmet Has Arrived . Ac Helmet, Viral Ne-TeluguStop.com

ఇప్ప‌టికే మ‌నం ఎన్నో వీడియోల్లో హెల్మెట్ ఉంటే ఎలా ప్రాణాలు కాపాడుకోవ‌చ్చో చూశాం.కొన్ని సార్లు హెల్మెట్ లోక‌పోతే చిన్న ప్ర‌మాదంలో కూడా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌ల గురించి విన్నాం.

మొన్న‌టికి మొన్న గుజ‌రాత్ లో ఓ వ్య‌క్తి త‌ల మీద నుంచి ట్రాక్ట‌ర్ టైర్ వెళ్లినా అత‌నికి ఏమీ కాలేదు.ఎందుకంటే ఆయ‌న హెల్మెట్ పెట్టుకున్నాడు.

మ‌రి అంత‌లా ఉప‌యోగ‌ప‌డుతుంది ఈ హెల్మెట్‌.

కానీ కొంద‌రు మాత్రం హెల్మెట్‌ను పెట్టుకోవ‌డానికి ఎందుకో ఇష్ట‌ప‌డ‌రు.

జుట్టు రాలిపోతుంద‌నో, లేదంటే భారంగా‌నో భావిస్తారు.పోలీసులు ఎన్ని సార్లు ఫైన్లు వేసినా మేమింతే అన్న‌ట్టు వెళ్తుంటారు.

అయితే ఇప్పుడు మేము చెప్పబోయే వార్త గురించి వింటే అసలు హెల్మెట్ వ‌ద్ద‌ని మాత్రం చెప్ప‌రు.ఎందుకంటే మ‌న హైద‌రాబాదీయులు ఏకంగా ఏసీ హెల్మెట్‌ను అందుబాటులోకి తెచ్చారు.

న‌గ‌రానికి చెందిన జర్ష్‌ సేష్టీ అనే కంపెనీ వారు ఈ విధ‌మైన ఏసీ హెల్మెట్‌ను రెడీ చేశారు.ఈ కంపెనీకి చెందిన కౌస్తుభ్‌ కౌండిన్య, శ్రీకాంత్‌ కొమ్ముల, ఆనంద్‌ కుమార్ క‌లిసి డెవ‌ల‌ప్ చేశారు.

Telugu Ac Helmet, Anandh Kumar, Dubai, Btime, Hyderabad-Latest News - Telugu

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచంలో ఏసీ హెల్మెట్ లేదు.ఇదే మొద‌టిది అని వారు చెబుతున్నారు.ఇక దీన్ని దుబాయ్‌లో ప్ర‌స్తుతం నిర్వ‌హిస్తున్న‌టువంటి ఎక్స్‌ 2020 దుబాయ్‌లో ఆవిష్కరించి అంద‌రికీ ప‌రిచ‌యం చేసేశారు.దీన్ని పెట్టుకుంటే గ‌న‌క ఎలాంటి చిరాకు ఉండద‌ని, కూల్‌గా అనిపిస్తుంద‌ని వారు చెబుతున్నారు.

ఎండ‌ల స‌మయంలో దీన్ని పెట్టుకుంటే మాత్రం అస్స‌లు తీయ‌కుండా అలాగే పెట్టుకోవాల‌ని పిస్తుంద‌ని వారు వివ‌రించారు.ఎంతైనా మ‌న హైద‌రాబాదీయులు మ‌రో ఘన‌త సాధించారంటూ అంతా ప్ర‌శంసిస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube