ఇదిగో నోటు.. వెయ్యాలి ఓటు ... లేకపోతే ఒట్టు  

  • డబ్బు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు ! మనం గెలవడం ముఖ్యం. ఎన్నికల్లో గెలిచి ప్రభుతం ఏర్పాటు చేస్తే ఆ తరువాత మన ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుంది. అప్పుడు దీనికి పదింతలు సంపాదించుకోవచ్చు అంటూ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు ఎమ్యెల్యే అభ్యర్థులకు… నియోజకవర్గ కీలక నాయకులకు నిత్యం నూరిపోస్తున్నారు. అవును ఇప్పుడు ఎన్నికల ఖర్చు భారీగా పెరగబోతోంది. ఏ పార్టీ కూడా డబ్బు గురించి లెక్కచేసే పరిస్థితి లేదు. ఎంతయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. అభ్యర్థులను కూడా ఆర్ధిక స్థితిమంతులనే ఎంపిక చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తరువాత ఏపీ లో. రాష్ట్రం ఏదైనా పార్టీల తీరు మాత్రం ఇలాగే ఉంది.

  • Note For Vote Othevice One Promise-

    Note For Vote Othevice One Promise

  • ఇక పార్టీలు కురిపిస్తున్న ఎన్నికల హామీలు చూస్తే … అసలు ఇవి అమలు చేయడం సాధ్యమేనా అని అనిపించకమానదు. అవి ఆచరణ సాధ్యమో అసాధ్యామో అన్న విషయాలు పక్కన బెడితే అసలు ఓటుకు ఎంత నోటు ఇస్తారనే దానిపై ఇప్పుడు ఆసక్తి పెరిగిపోయింది. గత ఎన్నికల్లో ప్రతీ నియోజకవర్గంలో ఓటుకు 1000 నుంచి ప్రాంతాన్నిబట్టి 3000 వరకు అది చాలకపోతే ఇంకా ఎక్కువ మొత్తంలో పెంచి పంచేందుకు అన్ని పార్టీలు సిద్దంగానే ఉన్నాయి. అధికార పార్టీలయితే ఇక ఖర్చుకు లెక్కలేదని ఎంతయినా ఒకే అని చెప్తున్నాయి. ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు దీనిని గుర్తించి తమ వ్యూహం మార్చారు. ఓటుకు నోటు తీసుకోవడంలో తప్పులేదని ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు. అంతేకాక వారం ఎంత ఇస్తే అంతా తీసేసుకుని జేబులో వేసుకోమంటున్నారు. కానీ ఓటు మాత్రం తమకే వేయమంటూ కొత్త ట్రెండ్ కి తెరలేపారు.

  • తెలంగాణలో అయితే నోటు ఒక చేతిలో పెట్టి మరో చేతితో ఒట్టు వేయించుకుంటున్నారు. మరికొందరు వివిధ సంఘాల్లో ఉన్న వారిని ఏకం చేసి మీకున్న సమస్యలు ఏంటి? వాటి పరిష్కారానికి ఎంత కావాలి? అంత మొత్తం ఇస్తాం మీ సంగంలో ఉన్న ఓట్లన్నీ మా పార్టీకే వేయాలని హామీలు తీసుకుంటున్నారు. అధికార పార్టీ నేతలపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా అధినేత చూసి చూడనట్లు వ్యవహిరించడానికి కారణం ఇలా ఐదేళ్లలో దోచుకుని, దాచుకున్న దానిలో 60శాతం ఎన్నికల్లో ఖర్చుపెట్టాలని అధినేత ఆదేశాలు జారీ చేయడమేనట. ఇక తెలంగాణలో అదే పరిస్థితి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ రైతు బంధు చెక్కులు, బతుకమ్మ చీరల పంపిణీ వంటి పథకాలతో పరోక్షంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం ఎప్పుడో ప్రారంభించింది.

  • Note For Vote Othevice One Promise-
  • ఏపీ టీడీపీ తరపున మహా కూటమికి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి గాను 3 హెలికాఫ్టర్లు, రూ.500కోట్ల నగదు నజరానా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కూడా ప్రచార సభల్లో ఆరోపణలు చేస్తున్నారు. ఇక తెలంగాణాలో నోటు ఓటు ఒట్టు అనే కొత్త ట్రెండ్ సక్సెస్ అయితే ఏపీ ఎన్నికల్లో ఈ ట్రెండ్ నాయకులు ఉపయోగించే అవకాశం కూడా పరిశీలిస్తున్నారు ప్రధాన పార్టీల అధినేతలు.