‘నోటా’ అట్టర్‌ ఫ్లాప్‌.. తేల్చి చెప్పిన క్లోజింగ్‌ కలెక్షన్స్‌  

 • యూత్‌ ఐకాన్‌ విజయ దేవరకొండ నటించిన ‘నోటా’ చిత్రం తాజాగా విడుదలయింది. ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీతాగోవిందం’ చిత్రాలతో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న విజయ్‌ ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టిన ఈ చిత్రం తర్వాత మిశ్రమ స్పందనను దక్కించుకోవడంతో కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఓవర్సీస్‌ మినహా అన్ని ఏరియాల్లో నిర్మాత స్వయంగా ఈ చిత్రాన్ని విడుదల చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో తమిళ ఫ్లేవర్‌ను ఎక్కువగా చూపించారు. ఈ చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలో పాగా వేయాలనుకున్న విజయ్‌కు నిరాశే మిగిలింది.

 • Nota Movie Total And Final Collections-

  Nota Movie Total And Final Collections

 • ఈ చిత్ర పెట్టుబడిలో కేవలం 40శాతం మాత్రమే రికవరీ చేసింది. 55శాతం నష్టాలనే మిగిల్చిందని తాజాగా బయటకు వచ్చిన క్లోజింగ్‌ కలెక్షన్లను చూస్తే అర్థం అవుతుంది. కలెక్షన్లను బట్టి చూస్తే విజయ్‌ కెరియర్‌లో అట్టర్‌ ఫ్లాప్‌ చిత్రంగా నిలిచిపోయింది. ఈ చిత్రం పరాజయం పాలడంతో విజయ్‌ బహిరంగ లేఖ రాసి త్వరలోనే మంచి సక్సెస్‌తో మీ ముందుకు వస్తాను అంటూ అభిమానులకు భరోసా ఇస్తూ, పండగ చేసుకునే వాళ్లు ఇప్పుడే చేసుకోండి ఆ తర్వాత ఈ అవకాశం ఇవ్వను అంటూ ప్రత్యర్థులను సవాల్‌ చేశాడు. త్వరలో ‘టాక్సీవాలా’ చిత్రంతో విజయ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 • ఏరియా వారిగా ‘నోటా’ క్లోజింగ్‌ కలెక్షన్లు
  నైజాం – 3.42 కోట్లు
  సీడెడ్ – 1.05 కోట్లు
  ఉత్తరాంధ్ర – 82 లక్షలు
  ఈస్ట్ – 58 లక్షలు
  వెస్ట్ – 37 లక్షలు
  కృష్ణ – 53 లక్షలు
  గుంటూరు – 60 లక్షలు
  నెల్లూరు – 32 లక్షలు
  టోటల్(ఏపీ + తెలంగాణా) – రూ. 7.69 కోట్లు
  రెస్ట్ ఆఫ్ ఇండియా – 83 లక్షలు
  ఓవర్సీస్ – 1.30 కోట్లు
  వరల్డ్ వైడ్ టోటల్ – రూ.9.82 కోట్లు