వివాదాల నడుమ విడుదలైన 'నోటా' తో విజయ్ దేవరకొండ మరోసారి హిట్ కొట్టారా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్..!  

Movie Title; నోటా
Cast & Crew:
న‌టీన‌టులు:విజయ్ దేవరకొండ,మెహ్రీన్,యాషికా ఆనంద్,నాజర్,సత్యరాజ్,ప్రియదర్శి తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: ఆనంద్ శంకర్
నిర్మాత‌:జ్ఞానవేల్ రాజు
సంగీతం: సామ్

STORY:
వరుణ్ (విజయ్ దేవరకొండ) ఫ్రెండ్స్ తో కలిసి బర్త్ డే పార్టీ చేసుకునే సీన్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. వరుణ్ తండ్రి నాజర్ సీఎం. సడన్ గా తన కొడుకు వరుణ్ సీఎం అవ్వాలనే నిర్ణయం తీసుకుంటాడు. వరుణ్ సీఎం గా పదవి చేపడతారు. కానీ ఏ మాత్రం సీఎం గా ప్రవర్తించాడు వరుణ్. బాద్యతమరిచి జల్సాలు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో నాజర్ ను సిబిఐ అరెస్ట్ చేస్తుంది. అప్పుడే మొదటిసారి వరుణ్ సెక్రటేరియట్ కు వెళ్తాడు. రాష్ట్రంలో జరుగుతున్నా గొడవలు ఆపడానికి వరుణ్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు. అలాగే తర్వాత ప్రజల సమస్యలను వరుణ్ ఎలా తీర్చాడు? ప్రతిపక్షం నుండి వచ్చిన వ్యతిరేకతను ఎలా ఎదురుకున్నాడు అనేవి తెలియాలంటే నోటా సినిమా చూడాల్సిందే.

Nota Movie Review And Rating-

Nota Movie Review And Rating

REVIEW:

ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ చేయని జోనర్ ఇది. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ద్వారా విజయ్ తమిళ ప్రేక్షకుల ముందుకు వెళ్తున్నారు. ఆయనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. మిళంలో ఈ చిత్రం సాఫీగానే విడుదలవుతున్నప్పటికీ, తెలుగులో మాత్రం కాస్త వివాదం రాజుకుంది. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడటంతో ‘నోటా’ చిత్రం ఓటర్లపై ప్రభావం చూపే అవకాశముందని ఈ సినిమా విడుదలపై కొందరు రాజకీయ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలను ఆపాలని డిమాండ్లు కూడా చేశారు. మొత్తానికి ఈ వివాదం మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Nota Movie Review And Rating-

‘నోటా’ సినిమా ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ మాత్రం అస్సలు బాగాలేదనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. మొత్తం మీద ఇది బిలో యావరేజ్ మూవీ అని తేల్చేస్తున్నారు. తమిళ ప్రజలకు కాస్తో కూస్తో నచ్చినా తెలుగు ప్రజలకు మాత్రం నచ్చదట. అయితే ఫస్టాఫ్‌లో వచ్చే పొలిటికల్ సీన్స్, విజయ్ దేవరకొండ మాస్ పొలిటికల్ ప్రెస్ మీట్ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుందని అంటున్నారు. ఇదే ఊపు సెకండాఫ్‌లో కొనసాగి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేదట. ఆనంద్ శంకర్ సెకండాఫ్‌ను మరీ బోరింగ్‌గా తెరకెక్కించారని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. విజయ్ దేవరకొండ ఎప్పటిలానే తన రౌడీ నటనతో మెప్పించారట. అయితే సత్యరాజ్, విజయ్ మధ్య వచ్చే కొన్ని సీన్లు ‘లీడర్’ సినిమాను గుర్తుచేస్తున్నాయని చెబుతున్నారు.

Plus points:
విజయ్ దేవరకొండ రౌడీ ఆక్షన్
మాస్ పొలిటికల్ ప్రెస్ మీట్ సీన్
ఫస్ట్ హాఫ్

Minus points
సెకండ్ హాఫ్
బోరింగ్ సన్నివేశాలు

Final Verdict:
నోటా సినిమా అభిమానులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. బిలో యావరేజ్

Rating: 2.5/5