‘నోటా’ మొదటి రోజు కలెక్షన్స్‌  

‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాల తర్వాత విజయ్‌ దేవరకొండ స్థాయి అమాంతం పెరిగి పోయిన విషయం తెల్సిందే. స్టార్‌ హీరోలకు కూడా సాధ్యం కాని వసూళ్లను గీత గోవిందం చిత్రంతో విజయ్‌ దేవరకొండ దక్కించుకున్నాడు. ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించి అద్బుతమైన రికార్డును సొంతం చేసుకున్న విజయ్‌ దేవరకొండ తాజాగా ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

Nota Movie First Day Collections-

Nota Movie First Day Collections

తమిళ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో జ్ఞానవేల్‌ రాజా ఈ చిత్రాన్ని నిర్మించాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది. అన్ని ఏరియాల్లో కలిపి మొదటి రోజు 7.35 కోట్లను వసూళ్లు చేసినట్లుగా సమాచారం అందుతుంది. విజయ్‌ దేవరకొండ నోటా చిత్రంతో కూడా భాగా రాబట్టబోతున్నట్లుగా ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రం ఏరియాల వారిగా మొదటి రోజు దక్కించుకున్న షేర్‌ :
నైజాం : 1.93 కోట్లు
వైజాగ్‌ : 51 లక్షలు
ఈస్ట్‌ : 34 లక్షలు
వెస్ట్‌ : 23 లక్షలు
కృష్ణ : 30 లక్షలు
గుంటూరు : 42 లక్షలు
న్లెూరు : 20 లక్షలు
సీడెడ్‌ : 62 లక్షలు
తమిళనాడు : 1 కోటి
కర్ణాటక : 60 లక్షలు
ఓవర్సీస్‌ : 75 లక్షలు
ఇతరం : 45 లక్షలు
మొత్తం : 7.35 కోట్లు