యూఎస్: ‘‘నీ రంగు నాలాగా లేదు’’.. భారతీయ సిక్కు యువకుడిపై సుత్తితో దాడి

ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.దేశాధ్యక్షుడి నుంచి తోటి అమెరికన్ల వరకు హిత బోధ చేస్తున్న అగ్రరాజ్యంలోని కొందరు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు.

 Not Same Skin Black Man Attacks Sikh With Hammer In Us-TeluguStop.com

దీంతో ఆసియా అమెరికన్లపై దాడులు ఏమాత్రం ఆగడం లేదు.వీరిని టార్గెట్ చేసుకుని విద్వేష దాడులకు పాల్పడుతున్న వారి సంఖ్య నానాటీకి పెరుగుతోంది.

భౌతికదాడులతో పాటు హత్యలకు సైతం ఉన్మాదులు వెనుకాడటం లేదు.మార్చి నెలలో అట్లాంటాలోని మూడు మసాజ్ పార్లర్లను లక్ష్యంగా చేసుకుని ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 8 మంది మహిళలు మరణించారు.

 Not Same Skin Black Man Attacks Sikh With Hammer In Us-యూఎస్: ‘‘నీ రంగు నాలాగా లేదు’’.. భారతీయ సిక్కు యువకుడిపై సుత్తితో దాడి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు సహా పలువురు ప్రముఖులు ఆసియన్లపై ద్వేషాన్ని విడనాడాలని పిలుపునిచ్చినా కొందరు మారడం లేదు.

దీని నుంచి మరిచిపోయేలోపే న్యూయార్క్‌లో ఓ వృద్ధురాలిపై నల్లజాతీయుడు తన ప్రతాపాన్ని చూపించాడు.

ఆమెను కాలితో తన్ని కిందపడేశాడు.ఈ పరిణామంతో కిందపడిపోయిన పెద్దావిడను అప్పటికీ వదలకుండా.

పొత్తి కడుపుపై పదేపదే కాలితో తన్నాడు.దెబ్బలు తాళలేక వృద్ధురాలు విలవిల్లాడిపోయింది.

తాజాగా రంగును సాకుగా చూపెడుతూ ఓ నల్లజాతీయుడు భారత సంతతి సిక్కు యువకుడిపై ఏకంగా సుత్తితో దాడి చేశాడు.ఏప్రిల్ 26న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

సుమిత్‌ అహ్లూవాలియా అనే సిక్కు యువకుడు బ్రౌన్స్‌విల్లేలోని క్వాలిటీ ఇన్ హోటల్‌లో పనిచేస్తున్నాడు.ఘటన జరిగిన రోజున ఓ నల్లజాతీయుడు హోటల్ లాబీలోకి వచ్చి పెద్దగా అరిచాడు.

దీంతో సుమిత్ అతనిని అడ్డుకునేందుకు వెళ్లాడు.కానీ, ప్రయోజనం లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందిని పిలిచాడు.

Telugu Asian-americans, Atlanta, Biden, Kamala Haries, Sumith-Telugu NRI

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిందితుడు జేబులో చేతులు పెట్టుకొని సుమిత్ వైపు వేగంగా పరిగెత్తుకొచ్చాడు.అప్పటికే ఆసియా అమెరికన్లపై వరుస ఘటనల నేపథ్యంలో సుమిత్ కాస్తంత భయపడ్డాడు.అయితే నువ్వు నా సోదరుడివి అంటూ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.కానీ, ఆ నల్లజాతీయుడు మాత్రం ‘నీ చర్మం రంగు నా చర్మం రంగు వేరు.

’ అంటూ జేబులో నుంచి సుత్తి బయటకు సుమిత్ తలపై దాడి చేశాడు.దీనిపై తొలుత భయపడిన సుమిత్ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు.

డాక్టర్‌ వద్ద చికిత్స అనంతరం చాలా రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.మరోవైపు ఈ ఘటనపై అమెరికాలోని సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.ఓ సిక్కు సంస్థ సుమిత్‌కు న్యాయ సహాయం అందిస్తానని పేర్కొంది.

#Biden #Atlanta #Kamala Haries #Asian-Americans #Sumith

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు