గుడిలోనే కాకుండా ఈ ప్రదేశాలలో కూడా చెప్పులు వేసుకోకూడదు తెలుసా..?

సాధారణంగా మన సాంప్రదాయాల ప్రకారం ఏదైనా పవిత్ర క్షేత్రాలకు, ప్రదేశాలను దర్శించినప్పుడు చెప్పులు బయటవదిలి వెళ్లడం పూర్వం నుంచి ఆచారంగా వస్తోంది.కేవలం గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా మన ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడుస్తుంటాము.

 Not Only In Temples But Also In These Places You Should Not Wear Your Footwear,-TeluguStop.com

మన ఇంటిలో కూడా పూజ గది ఉండటం వల్ల దేవుని గది వద్దకు చెప్పులు వేసుకోకుండా గుమ్మం బయటే వదిలి రావడం ఆనవాయితీగా వస్తోంది.కానీ ఈ మధ్యకాలంలో కొన్ని అనారోగ్య సమస్యల వల్ల చాలామంది ఇంటిలో కూడా చెప్పులు వేసుకుని నడుస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.

అయితే మన ఇంట్లో కూడా కొన్ని ప్రదేశాలలో చెప్పులు అసలు వేసుకోకూడదని పండితులు చెబుతున్నారు.అయితే ఆ ప్రదేశాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా మనం ఇంట్లో దేవుడి గది ఉన్నచోటకు చెప్పులు వేసుకొని వెళ్ళము.అదేవిధంగా మన ఇంట్లో నిత్యవసర వస్తువులు భద్రపరిచి ఉన్న ప్రదేశానికి కూడా చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు.

బంగారం, డబ్బులు దాచి ఉంచే బీరువా, వంట గదిలో కూడా చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు అని పండితులు చెబుతున్నారు.సాధారణంగా మనం వంటగదిలో ఆహారం తయారు చేసుకుంటాము.

నిప్పులను సాక్షాత్తు అగ్నిదేవుడుగా భావిస్తాము కనక వంటగదిలో చెప్పులు వేసుకుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు.

ఇక డబ్బులు, బంగారం దాచి పెట్టే చోటకి కూడా చెప్పులు వేసుకోకూడదు.ఎందుకంటే బంగారాన్ని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక ఆ ప్రదేశానికి వెళ్లేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు.అదేవిధంగా పుణ్య నదులు అయినటువంటి గంగ,కృష్ణ ,గోదావరి నదులను సాక్షాత్తు దైవ సమానంగా భావిస్తారు.

కాబట్టి అలాంటి నదులను సందర్శించేటప్పుడు, పుష్కరాల సమయంలో లేదా కుంభమేళా జరిగిన సమయంలో చెప్పులు ధరించి నదిలోకి దిగ కూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.అందుకే మన పూర్వీకులు ఎక్కువభాగం చెప్పులు లేకుండా నడవడం అలవాటు పడేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube